HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Virat Kohli T20 Career To End Soon

Rohit Sharma- Virat Kohli: టీ ట్వంటీల్లో ఇక కష్టమే.. కోహ్లీ, రోహిత్‌ల కెరీర్ ముగిసినట్టే..!

టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli) టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వీరిద్దరినీ మళ్ళీ షార్ట్ ఫార్మాట్‌లో చూడలేమా.. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

  • Author : Gopi Date : 07-07-2023 - 6:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma- Virat Kohli
Resizeimagesize (1280 X 720) 11zon

Rohit Sharma- Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli) టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వీరిద్దరినీ మళ్ళీ షార్ట్ ఫార్మాట్‌లో చూడలేమా.. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. 2024 టీ ట్వంటీ వరల్డ్‌కప్ లక్ష్యంగా టీమ్‌ను సెలక్టర్లు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే యువక్రికెటర్లకు ప్రాధాన్యతనిస్తుండగా.. కోహ్లీ,రోహిత్‌లను పక్కన పెడుతున్నారని చెబుతున్నారు. టీమిండియా ఐసీసీ టోర్నీ గెలిచి 12 ఏళ్ళు దాటిపోయింది. టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచి కూడా 16 ఏళ్ళవుతోంది..ఐపీఎల్‌తో ఎంతోమంది టీ ట్వంటీ స్టార్స్ వెలుగులోకి వచ్చినా మెగా టోర్నీలో మాత్రం టైటిల్ విజయం భారత్‌కు అందని ద్రాక్షగానే ఉంటోంది.

గత ఏడాది కూడా టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో నిరాశే మిగిలింది. దీంతో వచ్చే ఏడాది జరిగే టీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం ఇప్పటి నుంచే బీసీసీఐ జట్టును సిద్ధం చేస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి యువక్రికెటర్ల వైపే మొగ్గుచూపుతోంది. తాజాగా విండీస్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టే దీనికి ఉదాహరణ. అయితే ఇదే సమయంలో సీనియర్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ ట్వంటీ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా రాణించడం లేదు. ఒకప్పుడు అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టిన కోహ్లీ, రోహిత్‌ ప్రస్తుత ఫామ్‌ స్థాయికి తగినట్టుగా లేదు. అందుకే టీ ట్వంటీ టీమ్‌ నుంచి వీరిద్దరినీ సెలక్టర్లు పక్కన పెట్టారన్నది అర్థమవుతోంది. రెస్ట్ పేరుతో వీరిద్దరిని పక్కన పెట్టామని చెబుతున్నా షార్ట్ ఫార్మేట్‌లో వీరిద్దరి కెరీర్ ముగిసినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read: PCB New Chairman: పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్

ఇప్పటి వరకూ కోహ్లీ 115 టీ ట్వంటీల్లో 4008 పరుగులు చేయగా..37 హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. అటు రోహిత్‌ కెరీర్‌ను చూస్తే 148 టీ ట్వంటీల్లో 3853 పరుగులు చేయగా..29 సెంచరీలు, 4 శతకాలు ఉన్నాయి. గత ఏడాది ప్రపంచకప్‌ నుండీ వీరిద్దరి టీ ట్వంటీ ప్రదర్శన దూకుడుగా లేదు. ఐపీఎల్‌లో పర్వాలేదనిపిస్తున్నా అంతర్జాతీయ టీట్వంటీల్లో మాత్రం అంచనాలు అందుకోవడం లేదు. ఈ కారణంగానే సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ లక్ష్యంగా టీమ్‌ను ఎంపిక చేస్తూ వస్తోంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సెలక్టర్లు టీ ట్వంటీ జట్టుకు త్వరలోనే పూర్తిస్థాయి సారథిగా అతన్ని ప్రకటించే అవకాశముంది. అటు ఐపీఎల్‌తో పాటు దేశవాళీ ట్వంటీ టోర్నీల్లో పలువురు క్రికెటర్లు అదరగొడతుండడంతో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే వరుసగా పలు సిరీస్‌లకు కోహ్లీ, రోహిత్‌లను పక్కన పెట్టిన సెలక్టర్లు పరోక్షంగా తప్పుకోమని చెప్పకనే చెప్పినట్టు అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించేందుకు స్వదేశంలో జరిగే ఏదైనా సిరీస్‌కు ఎంపిక చేయొచ్చు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే టీట్వంటీ టీమ్‌లో మళ్ళీ వీరిద్దరినీ చూడడం కష్టమనే భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket news
  • rohit sharma
  • team india
  • virat kohli

Related News

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd