Test Winnings: సచిన్ ను అధిగమించిన రోహిత్
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది
- Author : Praveen Aluthuru
Date : 16-07-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
Test Winnings: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ ఆధిపత్యం చెలాయించగా, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించాడు. అయితే ఈ టెస్ట్ ద్వారా రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. సచిన్ 25 టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అందులో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అదే సమయంలో రోహిత్ కేవలం 8 మ్యాచ్‌ల్లో రోహిత్ సారధ్యంలో అయిదు మ్యాచ్ లు గెలిచింది.
క్రికెట్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లి 68 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అందులో 40 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. 2022 జనవరిలో టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు విరాట్ ప్రకటించాడు.
కోహ్లి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు. ధోనీ కెప్టెన్సీలో జట్టు 60 మ్యాచ్‌లలో 27 మ్యాచ్‌లలో విజయాన్ని అందుకుంది. అదే సమయంలో సౌరవ్ గంగూలీ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. గంగూలీ సారధ్యంలో 49 మ్యాచ్‌లలో 21 మ్యాచ్‌లలో జట్టును గెలిచింది.