HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Us Israel War Causes Oil Crisis In Vietnam Thailand

ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

  • Author : Vamsi Chowdary Korata Date : 11-03-2026 - 11:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thailand, Vietnam fuel crisis
Thailand, Vietnam fuel crisis

Fuel Crisis  హోర్ముజ్ జలసంధిలో రాజుకున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియా సరిహద్దులు దాటి ఆగ్నేయాసియా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో, థాయ్‌లాండ్, వియత్నాం ప్రభుత్వాలు తమ దేశాల్లో ‘ఇంధన అత్యవసర పరిస్థితి’ తరహా చర్యలకు శ్రీకారం చుట్టాయి. చమురు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో, ప్రభుత్వ యంత్రాంగాలు ఇంధన పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి.

వియత్నాంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి అక్కడ పెట్రోల్ ధరలు 32 శాతం పెరగ్గా… డీజిల్, కిరోసిన్ ధరలు ఏకంగా 56 నుండి 80 శాతం వరకు ఎగబాకాయి. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ మిన్ స్వయంగా రంగంలోకి దిగి కువైట్, ఖతార్ వంటి దేశాలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, రాజధాని హనోయిలోని వీధుల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అదుపు చేసేందుకు పారిశ్రామిక, వాణిజ్య శాఖ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పించాలని స్థానిక సంస్థలకు కీలక సూచనలు చేశారు.

అటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పనిదినాలను అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తూనే, మిగిలిన విభాగాల సిబ్బందిని ఇంటి నుండే విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. సొంత వాహనాల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి, సైకిళ్లు లేదా ప్రజా రవాణాను ఆశ్రయించాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. అధికారుల విదేశీ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూనే, కార్‌పూలింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అదుపులోకి వచ్చే వరకు ఈ కఠిన నిబంధనలు పాటించక తప్పదని ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fuel
  • Fuel shortage
  • Hormuz Strait tensions
  • IT companies work from home
  • Oil Prices
  • Petrol Price Hike
  • Petrol Prices
  • Pham Minh Chinh
  • Southeast Asia energy crisis
  • Thailand fuel crisis
  • vietnam
  • Vietnam fuel crisis
  • work from home

Related News

US blockade on Iran ports along Strait of Hormuz

Hormuz Strait: 10 వేల మంది సైనికులతో హార్ముజ్ దిగ్బంధనం – అమెరికా

హర్మూజ్ జలసంధితో సహా ఇరాన్‌లోని కీలక ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనానికి ఇరాన్ పోర్టుల్లో దాదాపు 10 వేల మంది సైనికులు, మెరైనర్లు, వైమానిక దళ సిబ్బందిని అమెరికా మోహరించింది. సముద్ర మార్గం ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్యంపైనే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంటుందని, కాన

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd