Krunal Pandya In Pushpa 2: పుష్ప-2లో పాండ్యా బ్రదర్.. వెల్లువెత్తుతున్న మీమ్స్!
ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే ఇష్యూపై చర్చ నడుస్తుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన తెలుగు నటుడు తారక్ పొన్నప్ప క్యామియోను క్రికెటర్ కృనాల్ పాండ్యాతో పోలుస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
- By Gopichand Published Date - 01:20 PM, Sat - 14 December 24

Krunal Pandya In Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 చిత్రం దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతుంది. 283 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం వారం రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. సుకుమార్ మాస్ ఎలివేషన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఇక బన్నీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఆ జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ నటనకు మరో జాతీయ అవార్డు ఇచ్చినా తప్పు లేదనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో తారక్ పొన్నప్ప క్యారక్టర్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరీ తారక్ పొన్నప్ప అనే చర్చించుకుంటున్నారు. కొందరైతే లేదు అతను హార్దిక్ పాండ్యా బ్రదర్ కృనాల్ పాండ్య (Krunal Pandya In Pushpa 2) అంటున్నారు.
ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే ఇష్యూపై చర్చ నడుస్తుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన తెలుగు నటుడు తారక్ పొన్నప్ప క్యామియోను క్రికెటర్ కృనాల్ పాండ్యాతో పోలుస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కృనాల్ నటుడు తారక్ లుక్‌లో ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. పుష్ప-2 చిత్రంలో తారక్ బుగ్గి రెడ్డి పాత్రలో నటించాడు. క్లైమాక్స్‌లో బన్నీతో బుగ్గి రెడ్డి సీన్స్ అద్భుతంగా పండాయి. అయితే కృనాల్ పాండ్యాను ఒక సెలబ్రిటీతో పోల్చడం ఇదే మొదటిసారి కాదు. 2019 లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే సమయంలోను కృనాల్ పేరు వినిపించింది.
అజయ్ దేవగన్ కృనాల్ లుక్స్ ఒకేలా ఉండటంతో ఫ్యాన్స్ కన్ఫ్యుస్ అయ్యారు. ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించగల సమర్థుడు. 2024 సీజన్ వరకూ లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆడాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ క్యాంప్‌లో వచ్చి చేరాడు.కృనాల్ పాండ్యా చేరికతో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడింది.