Meeting With Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు.. బన్నీతో కీలక సమావేశం!
పుష్ప-2 మూవీ డైరెక్టర్ సుకుమార్‌తో అల్లు అర్జున్ తన ఇంట్లో భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం.
- By Gopichand Published Date - 11:07 AM, Sat - 14 December 24

Meeting With Allu Arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు సినీ నటుడు అల్లు అర్జున్. తాజాగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన్ని పలువురు టాలీవుడ్ ప్రముఖులు కలుస్తున్నారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ చిల్ అవుతున్నట్లు కన్పిస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Meeting With Allu Arjun).. థమ్సప్ డ్రింక్ తాగుతూ చిల్ అవుతూ కెమెరాకు కనిపించారు. అయితే ఈ కేసులో బన్నీని కావాలనే టార్గెట్ చేసినట్లు టాలీవుడ్ ప్రముఖులు నమ్ముతున్నారు. ఇటీవల బన్నీ పుష్ప-2 సక్సెస్ మీట్ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్‌లోని ప్రముఖులు ఆయన నివాసానికి తరలివస్తున్నారు. మరోవైపు మెగా కుటుంబం నుంచి చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కూడా మరికాసేపట్లో బన్నీని కలవనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాఘవేంద్రరావు, తదితరులు బన్నీ ఇంటికి చేరుకున్నారు.
Also Read: CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
అల్లు అర్జున్ ను కలిసిన డైరెక్టర్ కె.రాఘవేంద్ర రావు #RaghavendraRao #AlluArjun #AlluArjun𓃵 #Hyderabad #Tollywood #AlluArjunArrestedNews #AlluArjunReleased #Pushpa2ThaRule #HashtagU pic.twitter.com/AkFayk16uS
— Hashtag U (@HashtaguIn) December 14, 2024
పుష్ప-2 టీమ్ అల్లు అర్జున్‌తో సమావేశం
పుష్ప-2 మూవీ డైరెక్టర్ సుకుమార్‌తో అల్లు అర్జున్ తన ఇంట్లో భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. సంధ్య థియేటర్ కేసుకు సంబంధించిన విషయాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఏ11గా ఉన్న బన్నీని తెలంగాణ పోలీసులు టార్గెట్ చేయడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. పుష్ప-2 తొక్కిసలాట ఘటన జరిగి 10 రోజుల తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడానికి ముందు చిక్కడపల్లి పోలీసుల నుంచి కానీ సీపీ సీవీ ఆనంద్ నుంచి కానీ అల్లు అర్జున్‌కు కానీ ఆయన నివాసానికి కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని సమాచారం. బన్నీ అరెస్ట్ వెనక ఏదో కుట్ర కోణం దాగి ఉందని టాలీవుడ్ ప్రముఖులు సైతం అంటున్నట్లు వినికిడి.