Rashid Khan: న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన రషీద్ ఖాన్.. రీజన్ ఇదే..!
వెన్ను గాయం నుండి కోలుకోవడానికి రషీద్ ఖాన్‌ను న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
- Author : Gopichand
Date : 30-08-2024 - 7:58 IST
Published By : Hashtagu Telugu Desk
Rashid Khan: చాలా కాలం తర్వాత ఆఫ్ఘనిస్థాన్ జట్టు టెస్ట్ క్రికెట్ ఆడబోతోంది. భారత గడ్డపై న్యూజిలాండ్‌తో ఆఫ్ఘాన్ జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. దీనికి సంబంధించి ఆఫ్ఘనిస్థాన్ జట్టును కూడా ప్రకటించారు. న్యూజిలాండ్‌తో ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ (Rashid Khan) దూరం కానున్నాడు. అందుకు కారణం వెలుగులోకి వచ్చింది.
వెన్ను గాయం కారణంగా రషీద్ ఔట్
వెన్ను గాయం నుండి కోలుకోవడానికి రషీద్ ఖాన్‌ను న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీని తర్వాత రషీద్ 4 నెలల పాటు క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని వెన్ను సమస్య దృష్ట్యా సుదీర్ఘ ఫార్మాట్ నుండి విరామం తీసుకోవాలని రషీద్, టీమ్ మేనేజ్‌మెంట్ పరస్పరం నిర్ణయించుకున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మూలం పిటిఐకి తెలిపింది. ఈ టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 9న భారతదేశంలోని గ్రేటర్ నోయిడాలో ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
Also Read: Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని తగ్గించాలంటే ఈ ఐదు పండ్లు తినాల్సిందే..!
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రషీద్ ఖాన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. అఫ్ఘానిస్థాన్ జట్టు తన అద్భుతమైన ఆటతీరుతో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
రషీద్ ఖాన్ క్రికెట్ కెరీర్
రషీద్ ఖాన్ ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్థాన్ తరఫున 5 టెస్టులు, 103 వన్డేలు, 93 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. రషీద్ టెస్టులో 34 వికెట్లు, వన్డేల్లో 183, టీ20లో 152 వికెట్లు తీశాడు. అంతేకాకుండా రషీద్ లిస్ట్ ఎలో 187 వికెట్లు కూడా తీశాడు. ఇప్పుడు రషీద్ ఖాన్ సెప్టెంబర్ 18 నుండి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తిరిగి రావచ్చు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.