Malaysia Masters 2024 Semifinal: మలేషియా మాస్టర్స్ మొదటి ఫైనల్‌కు అర్హత సాధించిన పివి సింధు
మలేషియా మాస్టర్స్‌లో పివి సింధు 13-21, 21-16, 21-12తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఎరీనాలో జరిగిన ఈ పోరు 2 గంటల 28 నిమిషాల పాటు కొనసాగింది
- By Praveen Aluthuru Published Date - 04:49 PM, Sat - 25 May 24

Malaysia Masters 2024 Semifinal: మలేషియా మాస్టర్స్‌లో పివి సింధు 13-21, 21-16, 21-12తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. ఎరీనాలో జరిగిన ఈ పోరు 2 గంటల 28 నిమిషాల పాటు కొనసాగింది. శనివారం కౌలాలంపూర్ 2024లో తన మొదటి వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో పీవీ సింధు చైనా క్రీడాకారిణి వాంగ్ జి యితో తలపడనుంది.
సింధుకు ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్ ఎప్పటినుంచో ప్రత్యర్థిగా కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ గతంలో 18 సార్లు ఒకరితో ఒకరు తలపడ్డారు. ఈ పోరులో పీవీ సింధు 17 సార్లు విజయం సాధించింది. తాజా మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా బుసానన్‌పై సింధు తన ఆధిక్యాన్ని 18-1కి పెంచుకుంది. 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో సింధును బుసానన్ ఓడించింది. గత ఏడాది మార్చిలో స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత BWF సర్క్యూట్‌లో సింధుకి ఇది మొదటి ఫైనల్. 2022లో సింగపూర్ ఓపెన్ తర్వాత టోర్నీ గెలవకపోవడంతో సింధు మలేషియా మాస్టర్స్‌లో ఆడాలని భావించింది.
కాగా అంతకుముందు క్వార్టర్‌ఫైనల్‌లో సింధు 21-13, 14-21, 21-12తో చైనా స్టార్‌ను ఓడించి టాప్ సీడ్ హాన్ యూపై అద్భుతమైన విజయాన్ని అందుకుంది . దీనికి ముందు ఆమె రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన సిమ్ యు జిన్‌పై మెరుగ్గా నిలిచింది. ఉబెర్ కప్ మరియు థాయిలాండ్ ఓపెన్ నుండి వైదొలగిన సింధు ఫిబ్రవరిలో తిరిగి వచ్చింది. ప్రపంచంలోనే 15వ ర్యాంక్‌లో ఉన్న సింధు జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్న పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొనే ముందు తన పాత వైభవాన్ని తీసుకురావాలని చమటోడుస్తుంది.
టోక్యో మరియు రియోలలో ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న సింధు దేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది. వాస్తవానికి చరిత్రలో బ్యాక్ టు బ్యాక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళ పీవీ సింధు కావడం విశేషం.
Also Read: Ananthapuram : తొలకరి జల్లు..ఆ రైతును లక్షాధికారిని చేసింది