ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్ మాజీ క్రికెటర్
- Author : Vamsi Chowdary Korata
Date : 12-02-2026 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
సక్లైన్ మాట్లాడుతూ, ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందని ఆరోపించాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పిచ్‌ను గ్రౌండ్స్ మెన్ ఎప్పుడైనా మార్చేయవచ్చని విచిత్రమైన ఆరోపణలు చేశాడు. అయితే, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పిచ్ సిద్ధం చేసే ప్రక్రియ కఠిన నియమావళి ప్రకారం జరుగుతుంది. ఐసీసీ క్యూరేటర్లు, మ్యాచ్ రిఫరీలు, గ్రౌండ్స్‌మెన్ సమన్వయంతో ముందస్తు ప్లాన్ ప్రకారం పిచ్ తయారు చేస్తారు. ఎప్పుడుపడితే అప్పుడు అకస్మాత్తుగా పిచ్ మార్చడం సాధ్యంకాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే సమయంలో పాకిస్థాన్ బౌలింగ్ కాంబినేషన్‌పై సక్లైన్ సందేహాలు వ్యక్తం చేశాడు. టీమిండియాతో మ్యాచ్ కు ముందు ఉస్మాన్ తారిఖ్ ఆత్మవిశ్వాసాన్ని పొందాడని చెప్పాడు. అయితే జట్టుకు ఇద్దరు పేసర్లు, ఒక ఆల్ రౌండర్ అవసరమైతే మొత్తం సమీకరణం మారిపోతుందని తెలిపాడు. పాకిస్థాన్ తరపున 20వ ఓవర్ ఎవరు వేస్తారు? తారిక్? నవాజ్? షాదాబ్? అబ్రార్? వీరిలో ఎవరు వేస్తారని ప్రశ్నించాడు.