HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pcb Writes Letter To Bcci Over Ct 2025 Participation Amid Uncertainty

PCB Writes Letter To BCCI: బీసీసీఐకి పీసీబీ లెట‌ర్‌.. ఈ విష‌యంపై గ‌ట్టిగానే డిమాండ్‌!

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భార‌త్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మానసికంగా సిద్ధమైందని తెలిసిందే.

  • By Gopichand Published Date - 09:50 AM, Sun - 20 October 24
  • daily-hunt
PCB Writes Letter To BCCI
PCB Writes Letter To BCCI

PCB Writes Letter To BCCI: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రస్తుతం సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి స్టేడియంల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఇప్పటికీ ఆడటంపై క్లారిటీ రాలేదు. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ అంగీకరించేలా పాకిస్థాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న కొత్త రిపోర్టుల్లో పాకిస్థాన్ భార‌త్ (PCB Writes Letter To BCCI)ను కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భార‌త్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మానసికంగా సిద్ధమైందని తెలిసిందే. అయితే బోర్డు ఇప్పటికీ ఒక షరతుపై మొండిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ గడ్డపై ఫైనల్ మ్యాచ్ ఆడాలని కోరుతోంది.

Also Read: Health Tips : రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నా.. ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే కారణాలు ఇవే..!

మేము మానసికంగా సిద్ధంగా ఉన్నాం: PCB

దీనికి సంబంధించి పీసీబీ అధికారి ఒకు మాట్లాడుతూ.. పీసీబీ మొదటి ఎంపిక, ప్రాధాన్యత మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో నిర్వహించడం. పాకిస్థాన్‌లో ఆడేందుకు తమ జట్టుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, యూఏఈలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించడంపై పీసీబీ కూడా మానసికంగా సిద్ధమైందన్నారు.

లాహోర్‌లో భారత్ ఫైనల్ ఆడాలని డిమాండ్‌

ఆ అధికారి ఇంకా మాట్లాడుతూ.. భారత్ పాక్‌లో ఆడకపోయినా, ఫైనల్‌ను లాహోర్‌లో ఎలాగైనా నిర్వహించాలని పిసిబి నిర్ణయించింది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించినా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీని పీసీబీ కోరుతోందన్నారు. టోర్నీ మొత్తానికి భారత్ పాకిస్థాన్‌కు రాలేకపోయినా, ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం లాహోర్‌లో ఆడాల్సి ఉంటుందని ఐసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విష‌య‌మై పీసీబీ.. బీసీసీఐకి లేఖ రాసిన‌ట్లు కూడా తెలుస్తోంది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ దాడిలో 175 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దీని తర్వాత భారత్- పాకిస్తాన్ జట్లు కేవ‌లం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • BCCI Vs PCB
  • Champions Trophy 2025
  • ICC
  • ICC Champions Trophy 2025
  • Pakistan Cricket Team
  • PCB
  • sports news

Related News

Raina- Dhawan

Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

1xBet, దాని అనుబంధ బ్రాండ్‌లపై అక్రమ లావాదేవీలు, ఆన్‌లైన్ జూదాన్ని ప్రోత్సహించడంతో పాటు మోసం ఆరోపణలు కూడా ఉన్నాయని అనేక రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది.

  • Harleen Deol Asks PM Modi

    Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

  • T20 World Cup 2026

    T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

  • RCB Franchise

    RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

  • Virat Kohli- Rohit Sharma

    Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

Latest News

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

  • Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాల‌నుకునేవారికి అదిరిపోయే శుభ‌వార్త‌!

  • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

  • TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

  • Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd