కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా
- Author : Vamsi Chowdary Korata
Date : 14-02-2026 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
Hardik Pandya టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్ కోసం కొలంబోలో అడుగుపెట్టిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య హోటల్ లాబీలో తన గర్ల్‌ప్రెండ్ మహిక శర్మతో కనిపించాడు. తద్వారా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీలులేదు. కానీ పాండ్యా గర్ల్‌ప్రెండ్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్తగా తన మెడ మీద హార్దిక్ పాండ్య ‘ఎమ్’ అనే అక్షరాన్ని టటూగా వేయించుకున్నాడని తెలుస్తోంది. ఇది అతడి గర్ల్ ఫ్రెండ్‌లోని మొదటి అక్షరం కావడం గమనార్హం.
హార్దిక్ పాండ్య, మహిక శర్మ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల టీ20 మ్యాచ్‌లో తన ప్రదర్శనను సైతం ఆమెకు అంకితమివ్వడం గమనార్హం. నాకు చాలా ఇష్టమైన వారికి ఈ క్రెడిట్ దక్కుతుందని, నా గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని, నా జీవితంలోకి ఆమె ప్రవేశించడం ది బెస్ట్ అని ఆ సందర్భంలో అన్నాడు.
కాగా, టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. స్థానిక సంగీతకారులు, నృత్యకారులు విమానాశ్రయంలో ఆటగాళ్లను సాంప్రదాయ డ్రమ్స్ మరియు ప్రదర్శనలతో స్వాగతించారు.