Sports
-
Rohit- Virat: కోహ్లీకి ఛాన్స్ ఉంది.. రోహిత్ కష్టమే: వసీం జాఫర్
టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మల (Rohit Sharma) టీ20 భవిష్యత్తుపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే టి20 ప్రపంచ కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడని జోస్యం చెప్పాడు. విరాట్ కోహ్లీ ఈ ఐసిసి టోర్నమెంట్లో చివరిసారిగా ఆడవచ్చని చెప్పాడు.
Published Date - 02:09 PM, Sat - 4 February 23 -
Indian Cricketer Wife: రూ.10 లక్షలు మోసపోయిన టీమిండియా క్రికెటర్ భార్య
భారత జట్టు స్టార్ బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar) భార్య జయను రూ.10 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ఆఫీస్ బేరర్, అతని కొడుకు బెదిరింపులకు పాల్పడ్డారు. వాస్తవానికి జయ నుంచి సంఘం మాజీ ఆఫీస్ బేరర్, ఆయన కుమారుడు వ్యాపారం పేరుతో రూ.10 లక్షలు తీసుకున్నారు.
Published Date - 09:06 AM, Sat - 4 February 23 -
Retirement: 2007 టీ20 వరల్డ్ కప్ హీరో రిటైర్మెంట్
2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ రిటైరయ్యాడు. అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశాడు. 39 ఏళ్ల జోగిందర్ చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.
Published Date - 01:39 PM, Fri - 3 February 23 -
PM Modi: ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ కు ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ కూడా..!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఈ నెలలో భారత్ (India)లో పర్యటించనుంది. ఈ జట్టు ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను ఇక్కడ ఆడాల్సి ఉంది. సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూడటానికి ఇద్దరు ప్రత్యేక అతిథులు రానున్నారు.
Published Date - 06:55 AM, Fri - 3 February 23 -
INDW vs SAW: ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు ఓటమి
ప్రపంచ కప్ ముంగిట సౌతాఫ్రికా మహిళల జట్టుతో ముక్కోణపు సిరీస్ (Tri-series)లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 110 లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టులో ట్రయాన్(51) రాణించడంతో.. 18 ఓవర్లలోనే ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.
Published Date - 06:25 AM, Fri - 3 February 23 -
Kohli Comments: టీ20ల్లో తన రికార్డును బ్రేక్ చేసిన శుభ్ మన్ గిల్ పై కోహ్లీ సంచలన కామెంట్స్
భారత యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) భీకర ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ తో వన్డేలో డబుల్ సెంచరీ,
Published Date - 11:55 AM, Thu - 2 February 23 -
Tri-Series FINAL: టైటిల్‌పై భారత అమ్మాయిల గురి.. నేడు దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్
మహిళల T20 ప్రపంచ కప్‌కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు గురువారం దక్షిణాఫ్రికాతో మహిళల T20I ట్రై-సిరీస్ (SA-W vs IND-W) కోసం తన సన్నాహాలను ప్రారంభించనుంది. భారత మహిళల క్రికెట్ జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ టైటిల్‌పై గురిపెట్టింది. నేడు జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
Published Date - 10:25 AM, Thu - 2 February 23 -
India Win T20 Series: టీమిండియానే అహ్మదా”బాద్ షా”… సిరీస్ కైవసం
సిరీస్ డిసైడర్‌లో టీమిండియా దుమ్మురేపింది... బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ మెరుపు సెంచరీతో రెచ్చిపోతే... బౌలర్లు సమిష్టిగా చెలరేగిపోయారు.
Published Date - 10:22 PM, Wed - 1 February 23 -
Shubhman Gill Century: గిల్ మెరుపు శతకం..భారత్ భారీస్కోరు
సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో భారత్ భారీస్కోర్ సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విశ్వరూపం చూపించాడు. బ్యాట్‌తో కివీస్ బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు.
Published Date - 09:08 PM, Wed - 1 February 23 -
Border-Gavaskar Trophy: తొలి టెస్టుకు కీలక బ్యాటర్ ఔట్
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మొదటి టెస్టులో ఆడడని టీమ్ మేనేజ్ మెంట్ తెలిపింది.
Published Date - 02:22 PM, Wed - 1 February 23 -
Australia Batsman: వీసా ఆలస్యం కావడంతో ఫ్లైట్ ఎక్కని ఆసీస్ ఓపెనర్..!
ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ కి బయలుదేరింది. అయితే టెస్టు సిరీస్‌కి ఎంపికైన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Khawaja) మాత్రం ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. ఉస్మాన్ ఖవాజాకి ఇండియన్ వీసా రావడం ఆలస్యం కావడంతో
Published Date - 11:59 AM, Wed - 1 February 23 -
IND Vs NZ T20 Match: నేడే ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా, న్యూజిలాండ్ (IND Vs NZ) మధ్య నేడు నిర్ణయాత్మకమైన మూడు టీ20 జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఒకటి గెలవగా, మరోదాంట్లో ఇండియా విజయం సాధించింది.నేడు జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి సిరీస్ దక్కుతుంది.
Published Date - 08:33 AM, Wed - 1 February 23 -
Lucknow Pitch: లక్నో పిచ్ క్యురేటర్ పై వేటు
టీ ట్వంటీ మ్యాచ్ అంటే అభిమానులు ఫోర్లు , సిక్సర్లు ఆశిస్తారు. వాటి కోసమే స్టేడియానికి వస్తారు.
Published Date - 08:47 PM, Tue - 31 January 23 -
Online Coach: పాక్ ఆన్లైన్ హెడ్‌కోచ్ గా మిక్కీ ఆర్థర్.. అఫ్రిది స్పందన ఇదే..!
పాఠశాల, కళాశాల లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు క్రీడా ప్రపంచంలో కూడా ఆన్లైన్ కోచింగ్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తన జట్టుకు ఆన్లైన్ కోచ్ గా మిక్కీ ఆర్థర్ (Mickey Arthur)ను నియమించవచ్చు.
Published Date - 03:38 PM, Tue - 31 January 23 -
Jasprit Bumrah: బూమ్రా కంటే మా షాహీనే గొప్ప బౌలర్: రజాక్
వీలు దొరికినప్పుడల్లా భారత్ క్రికెట్ పైనా, భారత క్రికెటర్ల పైనా నోరు పారేసుకోవడం పాకిస్థాన్ మాజీ ఆటగాళ్ళకు మామూలే. ఒక్కోసారి వారి మాటలు కోటలు దాటుతుంటాయి. హద్దు మీరి వ్యాఖ్యలు చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు. తాజాగా పాక్ మాజీ బౌలర్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 06:53 AM, Tue - 31 January 23 -
Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్ కు మురళీ విజయ్ గుడ్ బై
టీమిండియా వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ (Murali Vijay) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.తనకు సహకరించిన వారందికీ ధన్యవాదాలు తెలిపాడు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాని విజయ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
Published Date - 06:46 AM, Tue - 31 January 23 -
BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ లో వారికి ప్రమోషన్ ఖాయమే
టీ ట్వంటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమాన్ గిల్ ప్రమోషన్ అందుకానున్నారు.
Published Date - 12:19 PM, Mon - 30 January 23 -
Hockey World Cup 2023 : హాకీ వరల్డ్ కప్ విజేత జర్మనీ
భారత్ వేదికగా జరిగిన పురుషుల హాకీ ప్రపంచ కప్ లో జర్మనీ విజేతగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ఆ జట్టు
Published Date - 07:38 AM, Mon - 30 January 23 -
Ind Vs NZ 2nd T20: లెక్క సరి చేశారు… రెండో టీ ట్వంటీ భారత్ దే
న్యూజిలాండ్ తో లెక్క సరి చేసింది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 10:31 PM, Sun - 29 January 23 -
Team India: జయహో భారత్.. తొలి అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ సొంతం
టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. ఐసీసీ మొదటిసారి నిర్వహిస్తున్న తొలి అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ ని గెలిచి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.
Published Date - 08:28 PM, Sun - 29 January 23