BCCI: భారత క్రికెట్ జట్టుకు కొత్త సెలెక్టర్.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న బీసీసీఐ..!
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీలో ఒకరి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
- By Gopichand Published Date - 06:35 AM, Fri - 23 June 23

BCCI: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) పురుషుల సెలక్షన్ కమిటీలో ఒకరి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీసీఐ చేస్తున్న ఈ పని చూస్తుంటే త్వరలో భారత క్రికెట్ జట్టుకు కొత్త సెలెక్టర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు సెలక్టర్ పదవికి సంబంధించిన నోటీసును బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ఈ నోటీసును బీసీసీఐ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30, 2023. దరఖాస్తు చేసిన తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. అదే సమయంలో,సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తుల కోసం బోర్డు కొన్ని అర్హతలను సూచించింది. సెలక్షన్ కమిటీలో ఒక సభ్యుడు మాత్రమే అవసరమని బోర్డు స్పష్టంగా పేర్కొంది. టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌లకు జాతీయ జట్టును ఎంపిక చేసే బాధ్యత అతడిపై ఉంటుంది.
ఈ అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు
BCCI ప్రకారం.. సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి కింది అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థి ఏ ఫార్మాట్‌లో ఆడిన కనీస మ్యాచ్‌లు ఉండాలి.
– 7 (ఏడు) టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా
– 30 (ముప్పై) ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా
– 10 (పది) వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 20 (ఇరవై) ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి
ఇది కాకుండా, అభ్యర్థి కనీసం 5 సంవత్సరాల క్రితం ఆట నుండి రిటైర్ అయి ఉండాలి.
ఇందులో మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో (మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అసోసియేషన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో నిర్వచించినట్లు) మెంబర్‌గా ఉన్న ఏ వ్యక్తి అయినా పురుషుల సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు అర్హులు కాదు.
Also Read: Guinness World Record: 1.53లక్షల మంది ఒకేసారి యోగా.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు
అభ్యర్థులకు ఇవే ప్రధాన బాధ్యతలు
– న్యాయమైన, పారదర్శక పద్ధతిలో సాధ్యమైనంత ఉత్తమమైన జట్టును ఎంచుకోవాలి
– సీనియర్ జాతీయ జట్టు కోసం ఒక బలమైన బెంచ్ బలాన్ని ప్లాన్ చేయాలి
– అవసరమైతే టీమ్ మీటింగ్‌లకు హాజరు కావాలి
– దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లను చూడటానికి ప్రయాణాలు చేయాలి
– త్రైమాసిక ప్రాతిపదికన BCCI అపెక్స్ కౌన్సిల్‌కు సంబంధిత జట్టు పనితీరు మూల్యాంకన నివేదికలను సిద్ధం చేయాలి. అందించాలి.
– బీసీసీఐ సూచించినప్పుడు జట్టు ఎంపికపై మీడియాను అడ్రస్ చేయాలి.
– ప్రతి ఫార్మాట్‌లో జట్టుకు కెప్టెన్‌ని నియమించాలి.
– BCCI నియమాలు, నిబంధనలను అనుసరించాలి.