India Defeats Pakistan: పాకిస్థాన్ పై ఘన విజయం సాధించిన భారత్.. మ్యాచ్ మధ్యలో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం..!
బుధవారం జరిగిన దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ (SAAF)లో భారత ఫుట్‌బాల్ జట్టు పాకిస్థాన్‌ను (India Defeats Pakistan) ఓడించింది.
- By Gopichand Published Date - 08:14 AM, Thu - 22 June 23

India Defeats Pakistan: బుధవారం జరిగిన దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ (SAAF)లో భారత ఫుట్‌బాల్ జట్టు పాకిస్థాన్‌ను (India Defeats Pakistan) ఓడించింది. ఈ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా 4-0తో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సునీల్ ఛెత్రి భారత్‌కు అద్భుత ఆటను అందించాడు. ఈ మ్యాచ్ లో సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కాగా ఉదాంత సింగ్ 1 గోల్ చేశాడు. పెనాల్టీ కార్నర్లలో భారత కెప్టెన్ రెండు గోల్స్ చేశాడు. 81వ నిమిషంలో ఉదాంత సింగ్ భారత్ తరఫున గోల్ చేశాడు. అయితే ఉదాంత సింగ్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా రంగంలోకి దించారు.
భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్ చేశాడు
10వ నిమిషంలో భారత కెప్టెన్ తొలి గోల్ చేశాడు. 15వ నిమిషంలో సునీల్ ఛెత్రి రెండో గోల్ చేశాడు. దీని తర్వాత భారత జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి 74వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ గోల్ చేసి జట్టును 3-0తో ముందంజలో ఉంచాడు. అదే సమయంలో మ్యాచ్‌లో హాఫ్ టైమ్ విజిల్‌కు ముందు భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీని కాపాడుకోవాలంటే ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే..!
#WATCH: Scuffle Breaks Out Between India, Pakistan Players During SAFF Cup 2023 Match#INDvsPAK #football #SAFF2023 pic.twitter.com/pYyTWJOyOt
— Shubham Rai (@shubhamrai80) June 21, 2023
మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల ఆటగాళ్లు ఘర్షణ
భారత్, పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాకుండా సోషల్ మీడియా యూజర్స్ నిరంతరం వ్యాఖ్యానించడం ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. శ్రీకంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఇరు జట్ల ఆటగాళ్ల మైదానంలో ఆట జరుగుతుండగా బంతిని అందుకునే విషయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్ణణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భారత ఆటగాడు, పాకిస్థాన్ ప్లేయర్ చేతి నుంచి బాల్ లాక్కొనే క్రమంలో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగి ఆటకొనసాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించడం గమనార్హం.