HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Sehwag Confirms He Hasnt Been Asked To Be Bcci Selector

Sehwag: చీఫ్ సెలక్టర్ రేస్.. సెహ్వాగ్ ఏమన్నాడంటే..?

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది.

  • Author : Gopi Date : 23-06-2023 - 1:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sehwag
Resizeimagesize (1280 X 720) 11zon

Sehwag: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది. చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాలని బీసీసీఐ సెహ్వాగ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలన్నింటికీ సెహ్వాగ్ తన ప్రకటనతో ముగింపు పలికాడు.

ఇప్పుడు ఆసియా కప్, ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుండడంతో బీసీసీఐ కొత్త వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. పలువురు మాజీ క్రికెటర్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రేసులో ముందున్నట్టు వార్తలు వచ్చాయి. అప్లై చేసుకుంటే అతనే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అవుతాడన్న అభిప్రాయం వినిపించింది. తాజాగా దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చీఫ్ సెలక్టర్ పదవి కోసం తనను ఎవరూ సంప్రదించలేదంటూ క్లారిటీ ఇచ్చాడు.

నిజానికి చీఫ్ సెలక్టర్ గా ఉండే వ్యక్తికి బీసీసీఐ ఏడాది కోటి రూపాయలు చెల్లిస్తుంది. సెహ్వాగ్ లాంటి మాజీ క్రికెటర్లు ఎండోర్స్ మెంట్స్ , కామెంట్రీ, ఇతర ఒప్పందాలతో దీని కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నారు. దీంతో సెహ్వాగ్ అంతగా ఆసక్తి చూపలేదని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పైగా చీఫ్ సెలక్టర్ పదవి ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. ప్రతీ సిరీస్ కూ జట్టు ఎంపిక కత్తి మీద సామే. గత కొంత కాలంగా భారత జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతుండడంతో విపరీతమైన ఒత్తిడి నెలకొంది. కాగా నార్త్ జోన్ అభ్యర్థికి ఛీఫ్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ పదవికి సెహ్వాగ్ అప్లై చేసుకుంటాడన్న వార్తలు వచ్చాయి.

Also Read: Virat Kohli: బొద్దుగా ఉండే కోహ్లీ సూపర్ ఫిట్ గా ఎలా మారాడంటే!

ఫిబ్రవరి 2023లో చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేసిన తర్వాత భారత జట్టు సెలక్షన్ కమిటీలో ఖాళీ ఉంది. ఇప్పుడు బీసీసీఐ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా, టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రకటనలో చీఫ్ సెలెక్టర్ కావాలనే ప్రశ్నపై సెహ్వాగ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిరాకరించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తనకు చీఫ్ సెలక్టర్ పదవికి ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఇటీవల వచ్చిన వార్తలను సెహ్వాగ్ ఖండించాడు. చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయడంతో, భారత మాజీ ఆటగాడు శివ సుందర్ దాస్ తాత్కాలికంగా ఆ పదవిని నిర్వహిస్తున్నాడు. దాస్‌తో పాటు, సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులు ఎస్ శరత్, సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా ఉన్నారు.

సెలెక్టర్ కావడానికి ఈ అర్హతలు

సెలెక్టర్‌గా మారడానికి BCCI జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు లేదా 7 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 10 ODIలు ఆడి ఉండాలి. ఇది కాకుండా ఆ వ్యక్తి క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ అయి 5 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. సెహ్వాగ్ 2015లోనే రిటైర్మెంట్ తీసుకోవడంతో అతనికి అవకాశం ఉంది. అయితే ఈ పదవిపై వీరూ పెద్దగా ఆసక్తిగా లేకపోవడంతో మిగిలిన మాజీ క్రికెటర్లలో ఎవరు వస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • asia cup 2023
  • BCCI
  • Chetan Sharma
  • indian cricket team
  • Virender Sehwag

Related News

'Best gift ever!'... Waiting to see how Rajkummar Rao beats my 'cover drive': Sourav Ganguly

Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది తనకు లభించి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd