MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్!
గత రెండు సీజన్ల నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రతి సారి అభిమానులు ధోని ఈ సీజన్‌లో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని భావిస్తారు.
- By Gopichand Published Date - 04:09 PM, Sat - 17 May 25

MS Dhoni Retirement: గత రెండు సీజన్ల నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ (MS Dhoni Retirement) గురించి చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రతి సారి అభిమానులు ధోని ఈ సీజన్‌లో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని భావిస్తారు. కానీ ధోని మళ్లీ ఆడుతూ కనిపిస్తాడు. ఐపీఎల్ 2025లో కూడా ధోని ఆడటమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ధోని రిటైర్మెంట్‌పై పెద్ద సమాచారం బయటకు వస్తోంది.
ఐపీఎల్ 2026లో కూడా ధోని ఆడతాడా?
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ధోని తన రిటైర్మెంట్‌పై కొన్ని నెలల తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. అయితే జట్టులో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడం కొంత కష్టమని నివేదిక చెబుతోంది. ఈ కారణంగా ఎంఎస్ ధోని ప్రస్తుతం జట్టు నుంచి బయటకు వెళ్లలేడు. నిజానికి సీఎస్‌కే జట్టులో ఇంకా యువ ఆటగాళ్లు స్థిరపడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ధోని ఉనికి సీఎస్‌కేకు వికెట్ కీపర్, ఫినిషర్, మార్గదర్శకుడిగా చాలా ముఖ్యమవుతుంది.
ఐపీఎల్ 2025లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. మొదటి మ్యాచ్‌లలో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ గాయం కారణంగా అతడు మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరోసారి కెప్టెన్సీ ఎంఎస్ ధోనికి అప్పగించబడింది. అయినప్పటికీ జట్టు ప్రదర్శన మెరుగుపడలేదు. సీఎస్‌కే ఐపీఎల్ 2025లో తమ 12 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 9 మ్యాచ్‌లలో ఓటమి చవిచూడగా, కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాదించగలిగింది. ప్రస్తుతం సీఎస్‌కే ప్లేఆఫ్ రేసు నుంచి బయటకు వెళ్లిపోయింది.
Also Read: Health Tips: హై బీపీతో బాధపడుతున్నారా? మందులు లేకుండా కంట్రోల్ చేసుకునే టిప్స్ చెప్పారు బాబా రాందేవ్
2023లో చివరి టైటిల్ గెలిచింది
చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2023లో సీఎస్‌కే జట్టు చివరిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సీఎస్‌కే గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. గత సీజన్‌లో కూడా సీఎస్‌కే జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.