HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >High Blood Pressure Baba Ramdev Shares Natural Ways To Manage It Without Medication

Health Tips: హై బీపీతో బాధపడుతున్నారా? మందులు లేకుండా కంట్రోల్ చేసుకునే టిప్స్ చెప్పారు బాబా రాందేవ్

ఈ ఆధునిక యుగంలో హై బ్లడ్ ప్రెషర్ ఒక సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యగా మారింది. అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, అసమతుల్య ఆహారం ఇవన్నీ హై బీపీకి ప్రధాన కారణాలు. అందుకే ప్రతి సంవత్సరం మే 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే ను నిర్వహించి ప్రజల్లో ఈ "సైలెంట్ కిల్లర్" గురించి అవగాహన పెంచుతున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 03:27 PM, Sat - 17 May 25
  • daily-hunt
High Blood Pressure Tips By Ramdev Bhabha
High Blood Pressure Tips By Ramdev Bhabha

Health Tips: ఈ ఆధునిక యుగంలో హై బ్లడ్ ప్రెషర్ ఒక సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యగా మారింది. అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, అసమతుల్య ఆహారం ఇవన్నీ హై బీపీకి ప్రధాన కారణాలు. ఈ సమస్యను సమయానికి గుర్తించకుండా వదిలేస్తే, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి సంవత్సరం మే 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే ను నిర్వహించి ప్రజల్లో ఈ “సైలెంట్ కిల్లర్” గురించి అవగాహన పెంచుతున్నారు.

పతంజలి సంస్థ అధినేత, యోగ గురువు బాబా రాందేవ్ హై బీపీతో బాధపడుతున్నవారికి ఒక సహజమైన, మందులేని పరిష్కారాన్ని సూచించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే — కొన్ని ముఖ్యమైన ప్రాణాయామాలు, సహజ ఆహార పదార్థాలను దినచర్యలో చేర్చితే బీపీని పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావచ్చు.

బాబా రాందేవ్ చెప్పిన ప్రకారం, ప్రతిరోజూ ఈ 8 ప్రాణాయామాలను చేయడం వల్ల హై బీపీ అదుపులో ఉంటుంది: భస్త్రికా, కపాలభాతి, బాహ్య ప్రాణాయామం, ఉజ్జాయి, అనులోమ-విలోమ, భ్రామరీ, ఉద్గీత్, ప్రణవ ధ్యానం. ఇవి శరీరంలోని ఆక్సిజన్ ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, హృదయానికి శక్తినిస్తాయి.

ఇదే కాకుండా, బాబా రాందేవ్ ఆహారంలో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొరకాయ (లౌకీ) జ్యూస్ తాగడం చాలా ఉపయోగకరమని చెప్పారు. కానీ ఇది చేదుగా ఉండకూడదు. చెడిగా ఉండే సొరకాయ తాగితే వాంతులు, రక్త స్రావంతో కూడిన విరేచనాలు రావచ్చు.

సొరకాయ జ్యూస్‌లో ఆమ్లా (ఆవల), తులసి, పుదీనా, నిమ్మరసం కలిపి తాగితే ఇది ఇంకా శక్తివంతమైన ఔషధంగా మారుతుంది. ఆవలలో విటమిన్ C ఎక్కువగా ఉండి, రక్తనాళాలను బలపరుస్తుంది. తులసి, పుదీనా మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. నిమ్మరసం శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ప్రాకృతిక మార్గాన్ని బాబా రాందేవ్ ప్రతిరోజూ పాటించమని సూచిస్తున్నారు. దీని వల్ల మందుల అవసరం లేకుండా హై బీపీని కంట్రోల్ చేయవచ్చు.

మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా హై బీపీ సమస్య ఉంటే, ఈ యోగ, ఆయుర్వేద పద్ధతులను తప్పక పాటించండి. ఇవి శరీరానికి ఏవిధమైన దుష్పరిణామాలు లేకుండా ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Blood Pressure problems
  • Foods to eat in high blood pressure
  • health tips
  • Yoga For Blood Pressure

Related News

Health Tips

‎Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!

‎Health Tips: కొబ్బరి, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు నిపుణులు. మరి కొబ్బరి, బెల్లం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Garlic

    ‎Garlic: రోజు పరగడుపున ఒక వెల్లుల్లి తింటే చాలు.. నెల రోజుల్లో కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు!

  • Drinking Water

    ‎Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Drumstick Water

    ‎Drumstick Water: ఉదయాన్నే పరగడుపున మునగకాయ నీరు తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Headache

    Headache: మైగ్రేన్, తలనొప్పి స‌మ‌స్య వేధిస్తుందా? అయితే ఈ పొర‌పాట్లు చేయ‌కండి!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd