New Zealand Innings: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఇదే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టకరమని మరోసారి నిరూపించుకున్నాడు.
- By Gopichand Published Date - 06:22 PM, Sun - 9 March 25

New Zealand Innings: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ (New Zealand Innings) కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టకరమని మరోసారి నిరూపించుకున్నాడు. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పు లేదు. మాట్ హెన్రీ రూపంలో కివీస్ జట్టులో మార్పు వచ్చింది. మాట్ స్థానంలో నాథన్ స్మిత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
Also Read: SSMB29 Leak : ఆయన ఎదుట మోకరిల్లిన మహేశ్‌బాబు.. ‘ఎస్ఎస్ఎంబీ-29’ లీక్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. అయితే లీగ్ దశలోని చివరి మ్యాచ్‌లో గత వారం భారత్ న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించడంతో టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా పైచేయి సాధించింది. కాగా సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. కాగా, న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 252 పరుగుల విజయ లక్ష్యం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈరోజు మరోసారి రోహిత్ అండ్ టీమ్ అదే రిపీట్ చేయాలనుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.