Delhi Capitals: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం!
ఢిల్లీ క్యాపిటల్స్ ఒక నెలలో సహాయక సిబ్బందికి సంబంధించి మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 17న భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీని ప్రధాన కోచ్‌గా, వేణుగోపాలరావును క్రికెట్ డైరెక్టర్‌గా డీసీ నియమించింది.
- By Gopichand Published Date - 11:08 AM, Wed - 13 November 24

Delhi Capitals: IPL 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలు వేలం, రాబోయే సీజన్ కోసం సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కీలక నిర్ణయం తీసుకుంది. DC తన బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో మునాఫ్ సభ్యుడు.
ఐపీఎల్‌లో మూడు జట్ల తరఫున ఆడాడు
41 ఏళ్ల మునాఫ్‌కు ముందు జేమ్స్ హోప్స్ DCకి బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు. మునాఫ్ మూడు ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను 13 టెస్టులు, 70 ODIలు, మూడు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 35, 86, 4 వికెట్లు తీసుకున్నాడు. అతనికి ఐపీఎల్ అనుభవం కూడా ఉంది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరపున ఆడాడు. 63 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 74 వికెట్లు తీశాడు. మనాఫ్ 2017లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
Also Read: IND vs SA 3rd T20: నేడు భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20.. వెదర్, పిచ్ రిపోర్ట్ ఇదే!
నెల రోజుల్లో మూడు కీలక నిర్ణయాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఒక నెలలో సహాయక సిబ్బందికి సంబంధించి మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 17న భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీని ప్రధాన కోచ్‌గా, వేణుగోపాలరావును క్రికెట్ డైరెక్టర్‌గా డీసీ నియమించింది. రికీ పాంటింగ్ స్థానంలో 47 ఏళ్ల బదానీని కోచ్‌గా నియమించారు. భారత్ తరఫున నాలుగు టెస్టులు, 40 వన్డేలు ఆడిన బదానీకి వివిధ క్రికెట్ లీగ్‌లలో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. భారత్ తరఫున 16 వన్డేలు ఆడిన వేణుగోపాలరావు 2009లో ఐపీఎల్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడు.
మెగా వేలానికి ముందు డీసీ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్, అన్‌క్యాప్డ్ ఆటగాడు అభిషేక్ పోరెల్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. DC స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను రిటైన్ చేయలేదు. పంత్ ఇప్పుడు వేలంలోకి ప్రవేశిస్తాడు. అతని కోసం పెద్ద బిడ్ ఆశిస్తున్నారు. DC ఇప్పటి వరకు ఒక్కసారి కూడా IPL ట్రోఫీని గెలుచుకోలేదు.