Mumbai Indians: ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్.. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్!
ఐపీఎల్ 2025కి ముందు లిజాడ్ విలియమ్స్ గాయపడ్డాడు. సీజన్‌కు ముందు అతను ఫిట్‌గా లేడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఇప్పుడు మొత్తం IPL 2025 నుండి నిష్క్రమించాడు.
- By Gopichand Published Date - 06:24 PM, Sat - 8 March 25

Mumbai Indians: ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తమ జట్టులో పెద్ద మార్పు చేసింది. ఓ సౌతాఫ్రికా ఆటగాడు జట్టులోకి వచ్చాడు. సీజన్‌కు ముందు లిజాడ్ విలియమ్స్ గాయపడ్డాడు. ఇప్పుడు అతను మొత్తం టోర్నీకి దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో మరొక ఆటగాడ్ని ముంబై ప్రకటించింది. విలియమ్స్ స్థానంలో కార్బిన్ బాష్ ముంబై జట్టులోకి వచ్చాడు.
గాయం కారణంగా లిజాడ్ విలియమ్స్ ఔట్
ఐపీఎల్ 2025కి ముందు లిజాడ్ విలియమ్స్ గాయపడ్డాడు. సీజన్‌కు ముందు అతను ఫిట్‌గా లేడు. ఇటువంటి పరిస్థితిలో అతను ఇప్పుడు మొత్తం IPL 2025 నుండి నిష్క్రమించాడు. ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా దేశానికి చెందిన కార్బిన్ బాష్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. బాష్ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 1 టెస్ట్, 2 ODI మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు టీ-20 ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేయలేకపోయాడు. అయితే దేశవాళీ టీ-20లో 86 మ్యాచ్‌లు ఆడాడు. కొన్ని నెలల క్రితం బాష్.. పాక్ గడ్డపై టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
2022లో బాష్ రాజస్థాన్ రాయల్స్ తరఫున నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు. ఇది కాకుండా అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం దక్షిణాఫ్రికా జట్టులో కూడా స్థానం కల్పించారు.
Also Read: Viral Talk : అమ్మ పట్టుచీరలు నేనే కట్టుకున్నా.. సింగర్ స్వర్ణలత కుమారుడి వైరల్ టాక్
బాష్ కెరీర్ ఇదే
దక్షిణాఫ్రికా తరఫున 1 టెస్టు మ్యాచ్‌లో 81 పరుగులు చేయడంతో పాటు, బాష్ తన పేరిట 5 వికెట్లు పడగొట్టాడు. 2 వన్డేల్లో 55 పరుగులు చేయడమే కాకుండా 2 వికెట్లు తీశాడు.
IPL 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మైనర్స్, ర్యాన్ రికెల్టన్, శ్రీజిత్ కృష్ణన్, బెవాన్ జాకబ్స్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, విల్ జాక్వెస్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, విఘ్నేష్ పుత్తూర్, ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రీస్ టాప్లీ, వెంకట సత్యనారాయణ, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ ఉర్ రెహమాన్, జస్ప్రీత్ బుమ్రా, కార్బిన్ బాష్.