Most Wickets: ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరంటే?
2025 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహ్మద్ సిరాజ్. అతను ఇప్పటివరకు మొత్తం 37 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 24 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
- By Gopichand Published Date - 09:33 PM, Mon - 13 October 25

Most Wickets: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిరీస్‌ల తర్వాత సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. తాజాగా సిరాజ్ 2025లో అత్యధిక టెస్ట్ వికెట్లు (Most Wickets) తీసిన బౌలర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన వారి జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్‌ను కూడా సిరాజ్ వెనక్కి నెట్టేశాడు.
2025లో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు
2025 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహ్మద్ సిరాజ్. అతను ఇప్పటివరకు మొత్తం 37 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ 24 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ 36 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు. మిచెల్ స్టార్క్ 29 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇకపోతే 2025లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారతీయ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు. అతను ఈ ఏడాది ఇప్పటివరకు 23 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అవార్డుపై నందమూరి రామకృష్ణ హర్షం!
2025లో మహ్మద్ సిరాజ్ గణాంకాలు
మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆ సిరీస్‌లో సిరాజ్ మొత్తం 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతకుముందు జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ ఏడాది జరిగిన చివరి టెస్ట్ (సిడ్నీ టెస్ట్)లో సిరాజ్ 4 వికెట్లు తీశాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది మొత్తం 15 ఇన్నింగ్స్‌లలో అతను 37 వికెట్లు తీశాడు.
భారత బౌలర్ల వివరాలు
2025లో అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్ల విషయానికి వస్తే మహ్మద్ సిరాజ్ (37 వికెట్లు), తర్వాత జస్ప్రీత్ బుమ్రా (23 వికెట్లు), ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ (20 వికెట్లు) ఉన్నారు. ఈ ఏడాది అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్ రవీంద్ర జడేజా. అతను ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టాడు.