Mohammed Siraj: భారత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మైదానం వీడిన స్టార్ బౌలర్!
రెండో రోజు తొలి సెషన్‌లో మహ్మద్ సిరాజ్ 10.2 ఓవర్లు వేశాడు. ఇందులో అతను 28 పరుగులు చేశాడు. ఇందులో సిరాజ్ 4 మెయిడిన్ ఓవర్లు వేశాడు. సిరాజ్‌కు వికెట్ దక్కనప్పటికీ బాగా బౌలింగ్ చేశాడు.
- Author : Gopichand
Date : 15-12-2024 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
Mohammed Siraj: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో నేడు రెండో రోజు. రెండో రోజు తొలి సెషన్ వరకు టీమిండియా నుంచి అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. ఫాస్ట్ బౌలర్లు అద్భుత బౌలింగ్ ప్రదర్శించారు. తొలి సెషన్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
గాయపడిన సిరాజ్?
తొలి సెషన్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ క్రమంలో కండరాలు పట్టేయడంతో సిరాజ్ కొంత ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత సిరాజ్‌ను చూసేందుకు ఫిజియో మైదానం లోపలికి వచ్చారు. అయితే సమస్య కారణంగా సిరాజ్ ఫిజియోతో మైదానం నుండి బయటకు వెళ్ళవలసి వచ్చింది. సిరాజ్ ఎడమ కాలు కండరాలలో కొద్దిగా ఒత్తిడి ఏర్పడింది. దాని కారణంగా అతను సరిగ్గా నడవలేకపోయాడు. సిరాజ్ గాయం ఇప్పుడు టీమ్ ఇండియాలో టెన్షన్‌ని పెంచింది.
Also Read: Nandamuri Balakrishna : జూబ్లీహిల్స్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. వాట్స్ నెక్ట్స్ ?
సిరాజ్ తిరిగి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు
రెండో రోజు తొలి సెషన్‌లో మహ్మద్ సిరాజ్ 10.2 ఓవర్లు వేశాడు. ఇందులో అతను 28 పరుగులు చేశాడు. ఇందులో సిరాజ్ 4 మెయిడిన్ ఓవర్లు వేశాడు. సిరాజ్‌కు వికెట్ దక్కనప్పటికీ బాగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడు అభిమానులు సిరాజ్‌కు ఎలాంటి తీవ్రమైన గాయాలు తగలకూడదని, అతను త్వరగా ఫిట్ అయ్యి మైదానంలోకి రావాలని కోరుకుంటున్నారు.
ఇక తొలి సెషన్ ఆట గురించి మాట్లాడుకుంటే.. తొలి సెషన్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీశారు. సిరాజ్, ఆకాశ్ దీప్ లకు వికెట్ దక్కలేదు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ఈ వార్త రాసే సమయానికి ఆసీస్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ (95), ట్రావిస్ హెడ్ (135) ఉన్నారు.