Nandamuri Balakrishna : జూబ్లీహిల్స్‌లోని నందమూరి బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. వాట్స్ నెక్ట్స్ ?
జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ ఎదురుగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇల్లు ఉంది.
- By Pasha Published Date - 11:20 AM, Sun - 15 December 24

Nandamuri Balakrishna : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతల గురించే చర్చ జరుగుతోంది. హీరో నాగార్జునకు సంబంధించిన భవనాన్ని హైడ్రా కూల్చడంతో అప్పట్లో కలకలం రేగింది. ఇక తదుపరిగా నగరంలోని ఏ నటుడిని హైడ్రా టార్గెట్ చేయబోతోంది అనే దానిపై ప్రస్తుతం డిస్కషన్ నడుస్తోంది. ఈక్రమంలో ఓ విషయం బయటికి వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇంటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు మార్కింగ్ చేసి నోటీసులు ఇచ్చారని తెలిసింది.
Also Read :Sheikh Hasina : హసీనా వల్లే 3,500 మర్డర్స్.. బంగ్లాదేశ్ సర్కారు సంచలన అభియోగాలు
జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ ఎదురుగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇల్లు ఉంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు కూతవేటు దూరంలోనే బాలయ్య నివాసం ఉంటుంది. చాలా ఏళ్ల కిందట దాన్ని బాలయ్య కట్టించుకున్నారు. అందులోనే బాలకృష్ణ నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. వాహనాల రాకపోకలకు మరింత సరళతరం చేసే క్రమంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లను నిర్మించాలని సీఎం రేవంత్ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం నగరంలోని రోడ్లను విస్తరించేందుకు రెడీ అయింది. ఈక్రమంలోనే రోడ్ల విస్తరణ కోసం అవసరమైన చోట భూసేకరణ చేస్తున్నారు. భూసేకరణలో భాగంగా తీసుకోనున్న స్థలాలను గుర్తించి జీహెచ్‌ఎంసీ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. ఆ మార్కింగ్ వివరాలతో సదరు ఇళ్ల యజమానులకు నోటీసులను ఇస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్య బాబు ఇంటికి మార్కింగ్ చేసి నోటీసులను ఇచ్చారట.
Also Read :Billionaires Free Time : లీజర్ టైం దొరికితే.. ఈ బిలియనీర్లు ఏం చేస్తారో తెలుసా ?
ఇళ్ల యజమానులు అనుమతి ఇచ్చిన తర్వాతే చట్ట ప్రకారం పరిహారాన్ని చెల్లించి ఆ భూమిని రోడ్డు విస్తరణ కోసం సేకరిస్తారు. మొత్తం ఇంటిని తీసేయడం అనేది ఉండదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రోడ్డు అవసరమైన కొద్దిపాటి స్థలం మాత్రమే తీసుకుంటామని తెలిపారు. బాలయ్య బాబు ఇంటితో పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చాలామంది భవనాలకు తాము నోటీసులు ఇచ్చామని అధికార వర్గాలు చెప్పాయి. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే రోడ్డు విస్తరణ కోసం కొంత ఇంటి స్థలాన్ని వదులుకునేందుకు బాలయ్య రెడీ అయిపోయారని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ నుంచి భూపరిహారాన్ని తీసుకొని.. తన ఇంట్లో మిగిలిన స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌ను కట్టుకోవాలని బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట.