రంజీ ట్రోఫీ 2025-26.. మహ్మద్ షమీ మరోసారి మ్యాజిక్!
ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో షమీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లోని 9 ఇన్నింగ్స్‌ల్లో 17.03 సగటుతో 27 వికెట్లు పడగొట్టారు.
- Author : Gopichand
Date : 24-01-2026 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
Mohammad Shami: రంజీ ట్రోఫీ 2025-26 రెండో దశ పోటీలు జనవరి 22 నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బెంగాల్ క్రికెట్ జట్టు సర్వీసెస్ క్రికెట్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశారు. షమీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తన అనుభవాన్నంతా ఉపయోగించి ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఆయన మరోసారి 5 వికెట్ల హాల్ సాధించారు. తన అద్భుత ప్రదర్శనతో అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్‌లకు షమీ మరోసారి గట్టి సమాధానం ఇచ్చారు.
మహ్మద్ షమీ మరోసారి మ్యాజిక్
బెంగాల్- సర్వీసెస్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో షమీ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. సర్వీసెస్ జట్టుకు ఇంకా 2 వికెట్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి షమీ ఖాతాలో మరిన్ని వికెట్లు చేరే అవకాశం ఉంది. షమీ ధాటికి బెంగాల్ జట్టు భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.
Also Read: స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న
🚨 Mohammad Shami show continues in domestic cricket
Today he picked 5 wicket haul against Services in Ranji Trophy
– 37/2 in first innings
– 51/5 in second innings– He picked 15 wickets in just 7 games in Vijay Hazare Trophy
– He picked 16 wickets in just 8 games in SMAT… pic.twitter.com/hidq2Rahee
— Tejash (@Tejashyyyyy) January 24, 2026
ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో షమీ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లోని 9 ఇన్నింగ్స్‌ల్లో 17.03 సగటుతో 27 వికెట్లు పడగొట్టారు. ఇందులో 2 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి నాలుగు వికెట్లు తీయడం విశేషం. షమీ స్వింగ్‌కు బ్యాటర్లు విలవిలలాడుతున్నారు. ఆయన రాకతో బెంగాల్ జట్టు ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది.
నిలకడగా రాణిస్తున్నా దక్కని అవకాశం
దేశవాళీ క్రికెట్‌లో షమీ వరుసగా రాణిస్తున్నారు.
- విజయ్ హజారే ట్రోఫీ 2025-26: 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు.
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025: 8 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు.
ఇంతటి అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ ఆయనకు టీమ్ ఇండియాలోకి తిరిగి వచ్చే అవకాశం కల్పించడం లేదు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా షమీ డొమెస్టిక్ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నారు. ఒకవేళ ఇదే ఫామ్‌ను ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కూడా కొనసాగిస్తే గంభీర్-అగార్కర్ ద్వయానికి నిర్ణయం తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.