HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mana Shankara Varaprasad Garu Emerges As A Regional Industry Hit

ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన మెగాస్టార్ మూవీ.. రేపు సక్సెస్ మీట్‌!

ఈ భారీ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు.

  • Author : Gopi Date : 24-01-2026 - 4:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mana Shankara Varaprasad Garu
Mana Shankara Varaprasad Garu

Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం టాలీవుడ్‌ ప్రాంతీయ చిత్రాల విభాగంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ ‘ఇండస్ట్రీ హిట్’గా అవతరించింది. చిరంజీవికున్న అశేష ప్రజాదరణ, దానికి తోడు దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రేక్షకుల మధ్య ఉన్న బ్రాండ్ వాల్యూ తోడవ్వడంతో ఈ చిత్రం అద్భుతమైన ప్రారంభాన్ని అందుకుంది.

సంక్రాంతి రేసులో ఇతర పెద్ద సినిమాల నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పండగ సీజన్‌లో సినీ ప్రేక్షకుల మొదటి ఎంపికగా నిలిచిన ఈ చిత్రం సెలవుల తర్వాత కూడా పనిదినాల్లో తన పట్టును నిలబెట్టుకుంది. ప్రస్తుతం వచ్చిన లాంగ్ వీకెండ్‌ను కూడా అద్భుతంగా సొమ్ము చేసుకుంటూ వసూళ్ల జోరును కొనసాగిస్తోంది.

Also Read: ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం విశేషం. దశాబ్దాల క్రితం ఆయన టాలీవుడ్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన స్వర్ణయుగాన్ని ఈ సినిమా వసూళ్లు గుర్తుకు తెస్తున్నాయి. గతంలో సంక్రాంతికి విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచినప్పటికీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆ విజయాన్ని మించిపోయి, ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాంతీయ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టేసింది.

ఈ భారీ చిత్రంలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు. షైన్ స్క్రీన్స్- గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం సాధించిన అఖండ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం రేపు (ఆదివారం) భారీ స్థాయిలో ‘సక్సెస్ సెలబ్రేషన్స్’ నిర్వహించనుంది.

చిరంజీవి తన నటనతో, అనిల్ రావిపూడి తన మార్కు వినోదంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా మెగాస్టార్ చూపించిన ఎనర్జీ, డ్యాన్స్‌లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రాలలో ఇది అగ్రస్థానానికి చేరుకోవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anil ravipudi
  • chiranjeevi
  • Mana Shankara Varaprasad Garu
  • tollywood
  • venkatesh

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Grand Launch of Venky-Kalyan Ram Multi-starrer Anil Ravipudi: Venky and Kalyan Ram in Anil Ravipudi's Multi-starrer

    Venkatesh Kalyan Ram: అనిల్ రావిపూడి వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ గ్రాండ్ లాంచ్

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd