HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Smriti Mandhana Friend On Palash Muchhal

స్మృతి- ప‌లాష్ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మిదే?!

పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Gopichand Date : 24-01-2026 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Smriti Mandhana- Palash Muchhal
Smriti Mandhana- Palash Muchhal

Smriti Mandhana- Palash Muchhal: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నవంబర్ 2025లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాల్సింది. కానీ అకస్మాత్తుగా పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవడం లేదని ఇద్దరూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక షాకింగ్ మలుపు చోటుచేసుకుంది. స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విద్యాన్ మానే.. పలాష్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

స్మృతి స్నేహితుడి సంచలన వెల్లడి

పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భారత మహిళా క్రికెటర్లు ఆగ్రహంతో పలాష్‌పై దాడి చేసి కొట్టారని ఆయన పేర్కొన్నారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనం ప్రకారం విద్యాన్ ఇలా అన్నారు. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలోనే అతను మరొక మహిళతో ఏకాంతంగా ఉంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ దృశ్యం చాలా దారుణంగా ఉంది. అది చూసిన భారత మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారు. ఆ కుటుంబం అంతా మోసగాళ్లే. పెళ్లి చేసుకుని అతను సాంగ్లీలో స్థిరపడతాడని నేను అనుకున్నాను, కానీ అంతా రివర్స్ అయ్యింది అని పేర్కొన్నారు.

Also Read: రంజీ ట్రోఫీ 2025-26.. మహ్మద్ షమీ మరోసారి మ్యాజిక్!

ఆర్థిక మోసం ఆరోపణలు

కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా పలాష్ తనను ఆర్థికంగా కూడా మోసం చేశాడని విద్యాన్ ఆరోపించారు. సినిమా తీస్తానని చెప్పి పలాష్ తన దగ్గర లక్షలాది రూపాయలు తీసుకున్నాడని ఆయన తెలిపారు. పెళ్లి రద్దయినప్పటి నుండి పలాష్ తన ఫోన్ కాల్స్ ఎత్తడం లేదని విద్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే?

స్మృతి మంధాన- పలాష్ వివాహం నవంబర్ 23, 2025న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సి ఉంది. వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే పెళ్లి రోజే వేడుక ఆగిపోయింది. ఆ సమయంలో స్మృతి తండ్రి అనారోగ్యానికి గురయ్యారని, అందుకే పెళ్లి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు విద్యాన్ చేసిన వ్యాఖ్యలు పెళ్లి రద్దు వెనుక అసలు కారణం పలాష్ ప్రవర్తనేనని సూచిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood
  • cricket news
  • Palash Muchhal
  • Smriti Mandhana
  • sports news

Related News

Anushka Sharma

ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న కోహ్లీ భార్య‌?!

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. అనుష్క శర్మ ఆర్సీబీ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి యాజమాన్య బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. దానికి బదులుగా జట్టులో ఒక చిన్న వాటాను దక్కించుకోవాలని ఆసక్తి చూపుతున్నారు.

  • Mohammed Shami

    రంజీ ట్రోఫీ 2025-26.. మహ్మద్ షమీ మరోసారి మ్యాజిక్!

  • Pandya- Kartik Fight

    మైదానంలో గొడ‌వ ప‌డిన పాండ్యా, ముర‌ళీ కార్తీక్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Women Tour Of Australia

    ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

  • 11 Runs In 1 Ball

    ఫామ్‌లోకి వ‌చ్చిన టీమిండియా.. ఒకే బంతికి 11 ప‌రుగులు!

Latest News

  • కలబంద తొక్కలను పారేస్తున్నారా? అయితే ఉపయోగించండిలా!

  • స్మృతి- ప‌లాష్ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మిదే?!

  • స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న

  • రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతినే – చంద్రబాబు

  • రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు

Trending News

    • 1955లో బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే విధానాన్నే మార్చేసిన సి.డి. దేశ్‌ముఖ్!

    • ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన మెగాస్టార్ మూవీ.. రేపు సక్సెస్ మీట్‌!

    • బ్యాంకుల‌కు వ‌రుస‌గా మూడు రోజులపాటు సెల‌వులు!

    • మహమ్మద్ యూనస్ ఒక హంతకుడు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

    • 8వ వేత‌న సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd