WTC Final 2023: స్లిప్స్‌లో ఎక్కడ నిలబడతారో కోహ్లీ తెలుసుకోవాలి
పదేళ్ల తరువాత మరోసారి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో రోహిత్ సేన ఓటమి చవి చూసింది
- By Praveen Aluthuru Published Date - 09:34 PM, Tue - 13 June 23

WTC Final 2023: పదేళ్ల తరువాత మరోసారి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో రోహిత్ సేన ఓటమి చవి చూసింది. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు, బౌలింగ్, బ్యాటింగ్ లోనూ ఇంపాక్ట్ చూపించలేదు. ఇదిలా ఉండగా తాజాగా మాజీ టీమిండియా ఆటగాడు మహ్మద్ కైఫ్ తన స్పందన తెలియజేశారు.
టీమిండియా ఓటమికి పేలవమైన ఫీల్డింగ్ ఒక కారణమని తెలిపాడు. మైదానంలో భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ వల్ల ఫైనల్‌లో తీవ్ర నష్టం వాటిల్లిందని భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో కీలకమైన దశ రెండవ ఇన్నింగ్స్‌లో కోహ్లీ మిస్ చేసిన క్యాచ్ చాలా ఖరీదైనదిగా అభిప్రాయపడ్డారు. అలెక్స్ కారీ ఇచ్చిన క్యాచ్ విరాట్ కోహ్లీ మరియు పుజారా మధ్య వెళ్ళింది. ఆ సమయంలో కేరీ 41 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ సమయంలో ఆ క్యాచ్ అందుకుంటే ఆస్ట్రేలియా స్కోరుకు బ్రేక్ పడి ఉండేదన్నారు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీకి స్టీవ్ స్మిత్ హాఫ్ ఛాన్స్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా 190 వద్ద ఉన్నప్పుడు స్మిత్ ఔట్ అయ్యి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు కైఫ్.
ఇంగ్లండ్ ,ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్లిప్స్‌లో ఎక్కడ నిలబడతారో విరాట్ కోహ్లీ తెలుసుకోవాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బౌన్స్ ఎక్కువగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో స్లీప్ ఫీల్డర్ స్టంప్‌కు 25 గజాల దూరంలో నిల్చొని ఉంటాడని, అలాంటి అవకాశాలను క్యాచ్ చేసుకోవడానికి కోహ్లీ ఎక్కడ నిలబడతాడో తెలుసుకోవాలని అన్నాడు.
Read More: T20 First Six: టీ20 చరిత్రలో ఫస్ట్ సిక్స్ ఎవరిదంటే…?