T20 First Six: టీ20 చరిత్రలో ఫస్ట్ సిక్స్ ఎవరిదంటే…?
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ టీ29 క్రికెట్ చరిత్రలో ఓ ఫీట్ సాధించాడు. ఫాస్ట్ బౌలర్ గా పేరున్న వసీం అక్రమ్ టీ 20 క్రికెట్ చరిత్రలోనే మొదటి సిక్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
- Author : Praveen Aluthuru
Date : 13-06-2023 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
T20 First Six: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ టీ29 క్రికెట్ చరిత్రలో ఓ ఫీట్ సాధించాడు. ఫాస్ట్ బౌలర్ గా పేరున్న వసీం అక్రమ్ టీ 20 క్రికెట్ చరిత్రలోనే మొదటి సిక్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అక్రమ్ 20 ఏళ్ల క్రితం టీ20 క్రికెట్ చరిత్రలో తొలి సిక్సర్ కొట్టాడు. 2003 జూన్ 13న వైటాలిటీ బ్లాస్ట్ టీ20 లో వసీం అక్రమ్ ఈ సిక్సర్ కొట్టాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వసీం అక్రమ్ హాంప్‌షైర్ తరఫున ఆడుతున్నప్పుడు ససెక్స్‌పై ఈ సిక్సర్ సాధించాడు. తమాషా ఏమిటంటే ఈ మ్యాచ్‌లో వసీం అక్రమ్ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో 8 బంతుల్లో 10 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ టోర్నీలో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ టోర్నమెంట్‌లో హాంప్‌షైర్ పేలవమైన ప్రదర్శనను కనబరిచింది, గ్రూప్ దశలో చివరి స్థానంలో నిలిచింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఐదు టీ20 మ్యాచ్‌లు అక్రమ్ కెరీర్‌లో మొత్తం టీ20 మ్యాచ్‌లు. వసీం అక్రమ్ మే 2003లో రిటైర్మెంట్ తర్వాత ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు.
20 years ago today, Wasim Akram hit the FIRST EVER six in T20 cricket history – the first to be shown on TV 👏 #Blast23 #T20Blast @wasimakramlivepic.twitter.com/2P5i7n1fSo
— Farid Khan (@_FaridKhan) June 13, 2023
ఇదిలా ఉండగా అంతర్జాతీయ క్రికెట్‌కు ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడో ఇటీవల వసీం అక్రమ్ తెలిపాడు. తనను జట్టు నుంచి తప్పించడం వల్ల తాను చాలా నిరాశకు గురయ్యానని అక్రమ్ చెప్పాడు. సుల్తాన్ ఆఫ్ స్వింగ్‌గా పేరొందిన అక్రమ్ జట్టు నుంచి తప్పుకోవడంతో కలత చెంది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు.
వసీం అక్రమ్ 104 టెస్టుల్లో 414 వికెట్లు తీశాడు. అలాగే 2898 పరుగులు చేశాడు. వన్డేల్లో అక్రమ్ 356 వన్డేల్లో 3717 పరుగులు చేసి 502 వికెట్లు తీశాడు. 1992 ప్రపంచ కప్ ఛాంపియన్ పాకిస్థాన్ జట్టులో వసీం అక్రమ్ ఒక ఆటగాడు.
Read More: Virat Kohli: కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ఎపిసోడ్.. క్లారిటీ ఇచ్చిన దాదా