Manoj Tiwary: అందుకే నాకు గంభీర్ అంటే కోపం.. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ తన ప్రకటనలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. మనోజ్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి పెద్ద వార్త వెల్లడించాడు.
- By Gopichand Published Date - 07:53 PM, Thu - 23 January 25
Manoj Tiwary: మనోజ్ తివారీ (Manoj Tiwary).. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తన అనేక ఇంటర్వ్యూలలో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు చేశాడు. ఈ ఎపిసోడ్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఈ వివాదం ఎప్పుడు మొదలైందనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఇప్పుడు ఈ సమాధానానికి స్వయంగా మనోజ్ తివారీ సమాధానం ఇచ్చాడు. తనకు, గౌతమ్ గంభీర్‌కు మధ్య ఎందుకు గొడవ జరిగిందో చెప్పాడు.
భారత మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ తన ప్రకటనలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. మనోజ్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి పెద్ద వార్త వెల్లడించాడు. మనోజ్ తివారీ భారత్ తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గౌతమ్ గంభీర్ ఓ సందర్భంగా తన తల్లి, సోదరిని తిట్టాడని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదే విషయమై ఒకరోజు గౌతమ్‌కి తనకి మధ్య గొడవ కూడా జరిగిందని పేర్కొన్నాడు. 2015 రంజీ ట్రోఫీ సమయంలో తనకు, గంభీర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు మనోజ్ తివారీ తెలిపాడు.
Also Read: Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబు!
మనోజ్ తివారీ వన్డేల్లో 287 పరుగులు చేశాడు. టీ20లో 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ ఐపీఎల్‌లో మనోజ్ కెరీర్ బాగానే సాగింది. అతను 98 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మనోజ్ 1695 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.
గంభీర్‌పై ఇటీవల విమర్శలు
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై మనోజ్ తివారీ ఇలాంటి విమర్శలు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఆసీస్ పర్యటన తర్వాత కూడా గంభీర్‌పై తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు కోచ్ పదవి అనుభవం లేదని అన్నాడు. అంతేకాకుండా గంభీర్ పైకి ఒకటి మాట్లాడతాడని అన్నాడు. ఇకపోతే గంభీర్ కోచ్ అయిన తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే ఆసీస్ పర్యటనలో భారత్ జట్టు 3-1తో ఓడిన విషయం తెలిసిందే. దీంతో గంభీర్ కోచ్ పదవిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.