IPL 2025 Final: నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్?
బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల వేదికలను ప్రకటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి నివేదికలు వెలువడుతున్నాయి.
- By Gopichand Published Date - 05:51 PM, Tue - 20 May 25

IPL 2025 Final: బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల వేదికలను ప్రకటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి నివేదికలు వెలువడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ (IPL 2025 Final) కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నుండి తీసేసినట్లు సమాచారం. కోల్‌కతా స్థానంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రెండు జట్లకు పెద్ద ప్రయోజనం లభించనుంది. ఇందులో పంజాబ్ కింగ్స్ జట్టు పేరు కూడా ఉంది.
ఈ స్టేడియంలో ఫైనల్ ఆడవచ్చు!
క్రిక్‌బజ్ కొత్త నివేదికల ప్రకారం.. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగవచ్చు. అంతేకాకుండా ప్లేఆఫ్స్‌లోని రెండు మ్యాచ్‌లు ముల్లన్‌పూర్‌కు కూడా లభించవచ్చు. కొత్త నివేదికల ప్రకారం జూన్ 1న జరగనున్న క్వాలిఫయర్ 2 కూడా అహ్మదాబాద్‌లో హోస్ట్ చేయనున్నట్లు సమాచారం.
నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం బీసీసీఐ ఒక సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ జూన్ 1న జరగనుంది.
క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌పై కూడా అప్‌డేట్ వచ్చింది
ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మే 29న జరగనుంది. ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ కూడా న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో జరగవచ్చు. ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: Coca-Cola India : ‘మైదాన్ సాఫ్’ ప్రచారంపై డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్న డిస్కవరీ ఛానల్
వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ వేదికలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దేశంలో నెమ్మదిగా వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఈ కారణంతోనే ఫైనల్ కోసం అహ్మదాబాద్‌ను ఎంపిక చేసినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.
ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి
ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌లో ఒక జట్టు నాల్గవ జట్టుగా ఉంటుందని కూడా నిర్ధారణ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ప్లేఆఫ్స్ రేస్ నుండి నిష్క్రమించాయి.