Coca-Cola India : ‘మైదాన్ సాఫ్’ ప్రచారంపై డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్న డిస్కవరీ ఛానల్
ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా మైదానంలో చిత్రీకరించబడిన ఈ డాక్యుమెంటరీ, సాంకేతికత, భాగస్వామ్యాలు మరియు ఉద్దేశ్యంపై ఆధారపడి ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన కోకా-కోలా ఇండియా యొక్క ఆన్-గ్రౌండ్ ప్రయత్నాలను ఒడిసి పడుతుంది.
- By Latha Suma Published Date - 05:16 PM, Tue - 20 May 25

Coca-Cola India : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మక కార్యక్రమంలలో ఒకటైన మహా కుంభ్ 2025లో వ్యర్థాల నిర్వహణ మరియు రీసైక్లింగ్‌ను పునర్నిర్వచించటంలో సహాయపడిన కోకా-కోలా ఇండియా యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మైదాన్ సాఫ్’ గురించి , డిస్కవరీ ఛానెల్‌లో మరియు డిస్కవరీ+ లో మే 20 వ తేదీన డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా మైదానంలో చిత్రీకరించబడిన ఈ డాక్యుమెంటరీ, సాంకేతికత, భాగస్వామ్యాలు మరియు ఉద్దేశ్యంపై ఆధారపడి ప్రపంచంలోని అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన కోకా-కోలా ఇండియా యొక్క ఆన్-గ్రౌండ్ ప్రయత్నాలను ఒడిసి పడుతుంది.
“ఉద్దేశ్యాన్ని ప్రభావంగా మార్చడంలో మా నిబద్ధతను మైదాన్ సాఫ్ ప్రతిబింబిస్తుంది” అని కోకా-కోలా ఇండియా – నైరుతి ఆసియా కోసం ప్రజా వ్యవహారాలు, కమ్యూనికేషన్లు మరియు సస్టైనబైలిటీ ఉపాధ్యక్షురాలు దేవయాని ఆర్ఎల్ రాణా అన్నారు. “మరింతగా పునర్వినియోగపరచదగిన ప్యాకేజింగ్‌ను రూపొందించడం, పదార్థాల వినియోగాన్ని పెంచడం , విస్తృత స్థాయిలో సేకరణకు మద్దతు ఇవ్వడం అనే మా లక్ష్యాల కోసం మేము పని చేస్తున్నప్పుడు, మైదాన్ సాఫ్ వంటి కార్యక్రమాలు స్థానికంగా మరియు సాంస్కృతికంగా అవగాహన పెంచడానికి సహాయపడతాయి” అని అన్నారు.
“మార్పును ప్రేరేపించటం లో కథనం యొక్క శక్తిని మేము నమ్ముతాము” అని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దక్షిణాసియా ప్రకటనల ఆదాయాల అధిపతి తనజ్ మెహతా అన్నారు. “మైదాన్ సాఫ్ ప్రచారం సాంస్కృతిక వారసత్వం, సమాజ భాగస్వామ్యం , ఆధునిక పర్యావరణ పరిరక్షణ పద్ధతులు కలిసి వచ్చినప్పుడు ఏమి సాధించవచ్చనే దానికి ఒక బలమైన నిదర్శనం..” అని అన్నారు. ఈ డాక్యుమెంటరీలో మహా కుంభ్ 2025లో స్పెషల్ డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారిణి ఆకాంక్ష రాణా కనిపిస్తారు. ఆమె మాట్లాడుతూ.. “ప్రతిరోజూ, దాదాపు 1 నుండి 2 కోట్ల మంది కుంభ్‌ను సందర్శించేవారు, 500 నుండి 600 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు. కోకా-కోలా ఇండియా వంటి ప్రైవేట్ కంపెనీలు ముందుకు వచ్చి ఇంతటి భారీ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా వుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనా మార్పును ప్రోత్సహించడంలో మరియు వ్యర్ధాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడంలో వారి సహకారం ఈ కుంభ్‌ను మరింత పర్యావరణ హితంగా చేయడానికి గణనీయంగా సహాయపడింది” అని అన్నారు.
Read Also: DMK Leader Wife: డీఎంకే నేతపై భార్య సంచలన ఆరోపణలు.. కారులో లైంగికంగా వేధింపులు!