KL Rahul: ఢిల్లీ కోసం రిస్క్ తీసుకుంటున్న కేఎల్ రాహుల్!
టీమిండియా తరఫున ఓపెనర్‌గా, మూడో స్థానంలో మిడిలార్డర్, లోయరార్డర్ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.
- By Gopichand Published Date - 04:08 PM, Fri - 21 March 25

KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అటు ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ మొదలు కానుంది. దీంతో ఆటగాళ్లంతా ఒక్కో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ (KL Rahul) కూడా బిగ్ టార్గెట్‌తోనే వస్తున్నాడు. ఐపీఎల్-2025కు సిద్ధమవుతున్న కేఎల్ రాహుల్ జట్టు అవసరాల కోసం మరోసారి తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోనున్నాడు.
టీమిండియా తరఫున ఓపెనర్‌గా, మూడో స్థానంలో మిడిలార్డర్, లోయరార్డర్ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. నిజానికి ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రాహుల్ కు అద్భుత రికార్డు ఉంది. కానీ జట్టు ప్రయోజనాల కోసం ఓపెనర్ గా కాకుండా మిడిలార్డర్ లో రాహుల్ బ్యాటింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్ టాపార్డర్‌లో ఉండటంతో మిడిలార్డర్ లో ఆడాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం అతడి కెరీర్ కు శాపంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: FASTag: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 డెడ్ లైన్!
2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని అనుకుంటున్న రాహుల్.. తిరిగి టీమిండియా టీ20 జట్టులోకి రావాలని అనుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం భారత యువ జట్టులో ఏ పొజిషన్ కూడా ఖాళీగా లేదు. ఓపెనింగ్ స్లాట్ లో సంజూ శాంసన్ దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలు చేసి తన ప్లేస్ సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఒకవేళ సంజూ ఈసారి ఐపీఎల్ లో గనుక విఫలమైతే వికెట్ కీపర్ తో పాటుగా ఓపెనర్ కెఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. కానీ ఐపీఎల్‌లో రాహుల్ మళ్లీ మిడిలార్డర్‌లో ఆడితే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమని. ఢిల్లీ క్యాపిటల్స్ కోసం కెఎల్ రాహుల్ ఇంత పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.