Kapil Dev: రోహిత్ ఫిట్ నెస్ పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ఏ ఆటగాడికైనా ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం. ఫిట్ గా లేకుంటే ఆటలో రాణించలేరు.
- Author : Naresh Kumar
Date : 23-02-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఏ ఆటగాడికైనా ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం. ఫిట్ గా లేకుంటే ఆటలో రాణించలేరు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా ఫిట్ నెస్ కు బీసీసీఐ పూర్తి ప్రాధాన్యత ఇస్తోంది. అయితే గాయాల కారణంగా కొందరు మాత్రం ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా లో మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్ నెస్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఫీల్డ్ లో అతని కదలికలు కూడా చాలా బద్ధకంగా కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) రోహిత్ ఫిట్ నెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఓవర్ వెయిట్‌పై అసహసనం వ్యక్తం చేశాడు. లావుగా ఉన్నందుకు రోహిత్ శర్మ సిగ్గు పడాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీవీల్లో చూస్తే హిట్‌మ్యాన్ అస్సలు ఫిట్‌గా కనిపించడని, 140 కోట్లకు పైగా భారతీయులను రెప్రజెంట్ చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఫిట్‌గా లేకపోవడం అవమానకరమంటూ వ్యాఖ్యానించాడు.
అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఫిట్‌గా ఉండటం ఏ క్రీడకారుడికైనా చాలా ముఖ్యమని, ఈ విషయంలో జట్టు సారధి సభ్యులకు ఆదర్శంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. బరువు విషయంలో రోహిత్ ఇకనైనా జాగ్రత్త పడాలనన్నాడు. రోహిత్ గొప్ప ఆటగాడు, గొప్ప కెప్టెన్ అన్న విషయంతో ఏకీభవిస్తానని, అయితే లావు తగ్గేందుకు కావాల్సిన కసరత్తులు చేయాలని రోహిత్ కు సూచించాడు. కెప్టెన్ అనే వాడు జట్టు సభ్యులకు ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంలో కోహ్లి యావత్ క్రీడా ప్రపంచానికే ఆదర్శమని పరుగుల యంత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లిని చూస్తే ఫిట్‌నెస్ అంటే ఇదీ అనేలా ఉంటాడని ఆకాశానికెత్తాడు. రోహిత్ ఈ విషయంలో కాస్త కఠినంగా శ్రమించాలన్నాడు కపిల్. అతడు గొప్ప బ్యాటరే కావచ్చు కానీ ఫిట్ నెస్ విషయం చూస్తే కాస్త ఎక్కువ బరువు ఉన్నట్లు కనిపిస్తాడనీ చెప్పాడు. గొప్ప ప్లేయర్ అయినా గొప్ప కెప్టెన్ అయినా కూడా అతడు ఫిట్ గా ఉండటం ముఖ్యమని కపిల్ దేవ్ (Kapil Dev) విశ్లేషించాడు. అయితే కపిల్ దేవ్ విరాట్ తో పోలుస్తూ రోహిత్ ఫిట్ నెస్ ను ఎగతాళి చేయడంపై హిట్ మ్యాన్ ఫాన్స్ మండిపడుతున్నారు.
Also Read: Liver Cirrhosis: ఈ ఆయుర్వద మూలికలతో లివర్ సిర్రోసిస్ సమస్యను దూరం చేసుకోవచ్చు.