ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా..?
బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
- Author : Gopichand
Date : 30-01-2024 - 5:19 IST
Published By : Hashtagu Telugu Desk
ICC Chairman: బీసీసీఐ సెక్రటరీ జై షా ఐసీసీ ఛైర్మన్ (ICC Chairman)గా మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం షా బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇండోనేషియాలోని బాలిలో ACC వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) జరగనుంది. దీనిలో అధ్యక్షుడు జై షా ICC ఛైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు పోటీ చేయడం గురించి చర్చ ఉండవచ్చు.
ఐసీసీ చైర్మన్‌గా ఉండేందుకు జై షా ఏసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవచ్చు. నవంబర్ నెలలో ఐసిసి ఛైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. ఇందులో షా పాల్గొనవచ్చు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. షా ఏసీసీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టే చర్య తీసుకోవచ్చు.
Also Read: Virat Kohli: స్టార్ బ్యాటర్ డీన్ ఎల్గర్ పై ఉమ్మి వేసిన కోహ్లీ
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో జై షా పాల్గొని గెలిస్తే ఐసీసీ చైర్మన్ అవుతారు. ఐసీసీ చైర్మన్ స్వతంత్రంగా ఉన్నందున చైర్మన్ కావాలంటే ఏసీసీతో పాటు బీసీసీఐ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రెగ్ బార్క్లే ICC ఛైర్మన్‌గా ఉన్నారు. నవంబర్ 2022లో జరిగిన ఎన్నికలలో గ్రెగ్ బార్క్లే రెండు సంవత్సరాల పాటు ICC ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుంది.
వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏమి చర్చిస్తారు..?
ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో టీ20 ఫార్మాట్‌లో జరిగే తదుపరి ఆసియా కప్ వేదికపై చర్చించనున్నారు. నివేదికలను విశ్వసిస్తే.. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి చాలా మంది పోటీదారులలో ఒమన్,యూఏఈ కూడా ఉన్నాయి. ఇంతకుముందు 2023లో ఆడే ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా పాకిస్థాన్‌లో పర్యటించడానికి భారత్ నిరాకరించడంతో టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది. టోర్నమెంట్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరిగాయి. శ్రీలంకలో భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడింది. టోర్నీ ఫైనల్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్ గెలిచింది.
We’re now on WhatsApp : Click to Join