Team India New ODI Jersey: టీమిండియా కొత్త జెర్సీ విడుదల.. ఈ జెర్సీ ప్రత్యేకత ఏమిటంటే..?
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది.
- By Gopichand Published Date - 08:28 PM, Fri - 29 November 24

Team India New ODI Jersey: భారత జట్టు కొత్త వన్డే జెర్సీని (Team India New ODI Jersey) బీసీసీఐ విడుదల చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త జెర్సీని విడుదల చేసిన సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జై షా, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. నవంబర్ 29న జై షా భారత జట్టు కొత్త వన్డే జెర్సీని విడుదల చేశాడు. ఈ జెర్సీని జర్మన్ కంపెనీ అడిడాస్ తయారు చేసింది. భారత జట్టు ఈ జెర్సీని ధరించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోకి ప్రవేశించనుంది. ఇది ఫిబ్రవరి-మార్చిలో ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌పై భారత జట్టు కొత్త జెర్సీని ధరించనుంది
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. భారత జట్టు కొత్త జెర్సీతో ఈ సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది. దీని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఈ జెర్సీతో కనిపించనుంది.
📍 BCCI Headquarters, Mumbai
Mr Jay Shah, Honorary Secretary, BCCI & Ms Harmanpreet Kaur, Captain, Indian Cricket Team unveiled #TeamIndia's new ODI jersey 👏 👏@JayShah | @ImHarmanpreet | @adidas pic.twitter.com/YujTcjDHRO
— BCCI (@BCCI) November 29, 2024
జెర్సీ ప్రత్యేకత ఏమిటి?
ఈసారి బీసీసీఐ వేరే జెర్సీని తయారు చేసింది. మునుపటి జెర్సీ భుజాలపై నారింజ రంగు, జెర్సీ నీలం రంగులో ఉంది. అయితే ఈసారి త్రివర్ణ పతాకం క్రీడాకారుల భుజస్కంధాలపై కనిపించనుంది. అయితే త్రివర్ణ పతాకంతో పాటు భుజాలపై మూడు తెల్లటి గీతలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా జెర్సీ ముందు భాగంలో DREAM 11 అని ఉంది. దాని క్రింద INDIA అని రాశారు. ఓ వైపు బీసీసీఐ లోగో ఉండగా.. మరోవైపు అడిడాస్ కంపెనీ లోగో ఉంది.
Also Read: Skill University: స్కిల్ వర్సిటీలో ‘విప్రో’ భాగస్వామి కావాలి: మంత్రి శ్రీధర్ బాబు
మహిళల టీమ్ ఇండియా మొదట కొత్త జెర్సీని ధరించనుంది. వచ్చే నెల డిసెంబర్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్కడ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో మాత్రమే టీమ్ ఇండియా కొత్త జెర్సీని ధరించబోతోంది. డిసెంబర్ 5 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
పురుషుల క్రికెట్ జట్టు కొత్త జెర్సీని ఎప్పుడు ధరిస్తుంది?
మహిళల క్రికెట్ తర్వాత పురుషుల క్రికెట్ జట్టు ఈ కొత్త జెర్సీతో మైదానంలో కనిపించనుండడం గమనార్హం. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పటికీ.. దీని తర్వాత వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తో టీమిండియా వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో టీమ్ ఇండియా కొత్త జెర్సీతో కనిపించనుంది.