Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. తొలి మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్లు దూరం!
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో ఆడలేడు. బుమ్రా ఇంకా ఫిట్‌గా లేడని పాండ్యా తెలిపాడు. ఈ విషయాన్ని మార్చి 19న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్దిక్ పాండ్యా ప్రకటించాడు.
- By Gopichand Published Date - 03:15 PM, Wed - 19 March 25

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ తమ ఆరో టైటిల్‌ను గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో IPL 2025లో అడుగుపెట్టబోతోంది. అయితే ప్రస్తుతం ఆ జట్టు స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయంతో ఉన్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బుమ్రా ఫిట్‌నెస్‌కు సంబంధించి పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌లో జస్సీ ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. అయితే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు కెప్టెన్ మారనున్నట్లు కూడా తెలుస్తోంది.
జస్ప్రీత్ అప్‌డేట్
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలి మ్యాచ్‌లో ఆడలేడు. బుమ్రా ఇంకా ఫిట్‌గా లేడని పాండ్యా తెలిపాడు. ఈ విషయాన్ని మార్చి 19న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హార్దిక్ పాండ్యా ప్రకటించాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో జస్సీకి చోటు దక్కదు. అతను ప్రస్తుతం NCAలో ఉన్నాడు. మ్యాచ్ ఆడేందుకు బుమ్రాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.
Also Read: Betting Apps Scam : బెట్టింగ్ యాప్స్.. ఎలా దగా చేస్తున్నాయి ? చట్టాలతో కంట్రోల్ చేయలేమా ?
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను CSKతో ఆడనుంది. హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. అతడిపై ఒక మ్యాచ్ నిషేధం ఉంది. ఇటువంటి పరిస్థితిలో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీని చేపట్టనున్నాడు. హార్దిక్, జస్సీ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నారు. అయితే గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సమయంలో పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం ఉంది. అందుచేత పాండ్యా ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్‌కు దూరం అవుతున్నాడు.
IPL 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టు
- హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, బెవాన్ జాకబ్స్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మిన్నెస్, కృష్ణన్ శ్రీజిత్, నమన్ ధీర్, రాజ్ అంగద్ బావా, విఘ్నేష్ పుత్తూర్, విల్ జాక్వెస్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, అశ్విని కుమార్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, వెంకట్ సత్యనారాయణ రాజు, ముజీబ్-ఉర్-రెహమాన్, కార్బిన్ బాష్.