Ishan Kishan: టీమిండియాలోకి ఇషాన్ కిషన్.. ఈ నిబంధనలు పాటించాల్సిందే..!
మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం కారణంగా 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి ఇషాన్ కిషన్ విరామం తీసుకున్నాడు. ఈ విరామం ఇషాన్‌కు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
- By Gopichand Published Date - 08:19 AM, Sat - 17 August 24

Ishan Kishan: బుచ్చిబాబు టోర్నీలో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) చెలరేగిపోయాడు. చాలా కాలం తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్న కిషన్ ఈ టోర్నీలో జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా టీమ్ ఇండియాకు తిరిగి రానున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టీమ్ ఇండియాలో పునరాగమనం చేయడానికి BCCI అమలు చేసిన కఠినమైన సందేశాన్ని అనుసరించాలి.
కిషన్‌కి.. జై షా సందేశం
మానసిక ఆరోగ్య సంబంధిత అనారోగ్యం కారణంగా 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్ట్ సిరీస్ నుండి ఇషాన్ కిషన్ విరామం తీసుకున్నాడు. ఈ విరామం ఇషాన్‌కు భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అప్పటి నుండి ఈ ఆటగాడు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. అంతేకాదు BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుండి తొలగించబడ్డాడు. అప్పటి నుంచి ఇషాన్ తిరిగి జట్టులోకి రావాలని ఎదురు చూస్తున్నాడు. అతని పునరాగమనం గురించి BCCI సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. అతను దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని మరోసారి తెలిపారు.
Also Read: Mosquito Terminator Train : దోమలకు చెక్.. ‘మస్కిటో టర్మినేటర్’ బయలుదేరింది
85 బంతుల్లో సెంచరీ సాధించాడు
బుచ్చిబాబు టోర్నీలో మధ్యప్రదేశ్, జార్ఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనను అందించాడు. ఇషాన్ 85 బంతుల్లో 114 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ రెండు అద్భుతమైన సిక్సర్లు కూడా బాదాడు. దీనితో పాటు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు అతను జట్టులో స్థానం కోసం ట్రై చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ మరిన్ని అద్భుతాలు చేస్తే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వగలడని సమాచారం. అయితే ఇషాన్ చేసిన కొన్ని కారణాల వలన జట్టులో చోటు దక్కకపోవడమే కాకుండా.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించారు.
We’re now on WhatsApp. Click to Join.