Mosquito Terminator Train : దోమలకు చెక్.. ‘మస్కిటో టర్మినేటర్’ బయలుదేరింది
దోమల భరతం పట్టే ట్రైను బయలుదేరింది. అది వస్తే .. దోమల ఖేల్ ఖతమే అవుతుంది.
- By Pasha Published Date - 07:41 AM, Sat - 17 August 24

Mosquito Terminator Train : దోమల భరతం పట్టే ట్రైను బయలుదేరింది. అది వస్తే .. దోమల ఖేల్ ఖతమే అవుతుంది. ప్రత్యేకించి రైల్వే ట్రాక్‌లను, వాటి పరిసరాలను అడ్డాలుగా మార్చుకొని పుట్టుకొస్తున్న దోమలకు కాలం చెల్లుతుంది. ఇంతకీ ఏమిటా ట్రైన్ ? వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
‘మస్కిటో టర్మినేటర్ ఆన్ వీల్స్’..ఇదొక స్పెషల్ ట్రైన్ పేరు. దీన్ని తాజాగా ఢిల్లీ రైల్వే డివిజన్ ప్రారంభించింది. దోమల నివారణే ఈ రైలు ఏకైక లక్ష్యం. ఈ రైలుపై డీబీకేఎం అనే ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. దోమల నివారణ మందును పిచికారీ చేయడం ఈ పరికరం పని. ‘మస్కిటో టర్మినేటర్ ఆన్ వీల్స్’(Mosquito Terminator Train )రైలు కదులుతున్న సమయంలో ఈ యంత్రం నుంచి దోమల నివారణ మందు రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా పిచికారీ అవుతుంటుంది. రైల్వే ట్రాక్ నుంచి దాదాపు 60 మీటర్ల దూరం వరకు ఈ పిచికారీ వెళ్తుంది. ఈ రసాయనం పడిన చోట దోమల లార్వాలు, దోమల గుడ్లు ఉంటే నాశనం అవుతాయి.ఫలితంగా రైల్వే ట్రాక్‌ల పరిసరాల్లో దోమల సంతానోత్ప్పత్తి తగ్గిపోతుంది. వెరసి, రైల్వే ట్రాక్‌ల సమీపంలోని ఏరియాల ప్రజలకు దోమల బెడద తప్పుతుంది. ఈ రైలు రథ్‌ధానా నుంచి ఆదర్శనగర్ మీదుగా బాడ్లీ వరకు వెళ్తుంది. ఈ మార్గంలోని మొత్తం రైల్వే ట్రాక్‌పై దోమల మందును పిచికారీ చేస్తుంది.
దేశ రాజధాని పరీవాహక ప్రాంతం (NCR)లో ‘మస్కిటో టర్మినేటర్ ఆన్ వీల్స్’ రైలును సెప్టెంబర్ 21 వరకు నడపనున్నారు. దోమల సమస్య ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఈ రైలును తిప్పనున్నారు. ఈ రైలు ప్రతీ రౌండ్‌లో దాదాపు 75 కి.మీ ప్రయాణించి రైల్వే ట్రాక్‌లపై దోమల మందును పిచికారీ చేయనుంది. రైల్వే కాలనీలు, పాడైన నీటి కాల్వలు, పరిశుభ్రంగా లేని రైల్వే భూములలోనూ ఇది దోమల నివారణ మందును పిచికారీ చేస్తుంది.