HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >9 Arrested In Guntur Case Involving The Stripping Of A Woman

Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Author : Vamsi Chowdary Korata Date : 20-07-2026 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
9 arrested in Guntur case involving the stripping of a woman.
9 arrested in Guntur case involving the stripping of a woman.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, తీవ్రంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణాబాబు కాలనీకి చెందిన బాధితురాలు తన ఇంటి తాగునీటి పైప్‌లైన్‌కు నీళ్ల మోటారును అమర్చుకోగా, స్థానిక నిందితుడైన మల్లెల వెంకట రమణమూర్తి ఆమెను రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆమె భర్త నిరాకరించడంతో, రమణమూర్తి అధికారులతో మాట్లాడి ఆ మోటారును తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి వచ్చిన కొద్దిసేపటికే తీవ్ర ఆగ్రహానికి గురైన మల్లెల రమణమూర్తి.. తన కుటుంబ సభ్యులతో పాటు ట్రాన్స్‌జెండర్లను పిలిపించి బాధితురాలి ఇంటిపై దాడికి తెగబడ్డాడు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి, బట్టలు చింపేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసి అత్యంత అమానుషంగా కొట్టారు.

ఈ అమానవీయ ఘటనపై స్పందించిన గుంటూరు ఎస్పీ వాకుల్ జిందాల్ (SP Vakul Jindal), నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు మల్లెల రమణమూర్తితో పాటు ఈ దాడిలో పాల్గొన్న కుటుంబ సభ్యులు మరియు ట్రాన్స్‌జెండర్లను మొత్తంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడైనప్పటికీ, మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేస్తూ, మల్లెల రమణమూర్తిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించని స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై (CI) కూడా బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • guntur
  • Mallela Ramana Murthy Arrest
  • Nagarampalem
  • Woman Stripped Case

Related News

Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

సీఐడీ ఛార్జిషీట్ ప్రకారం, తాము సన్నిహిత సంబంధంలో ఉన్నప్పటి ఫోటోలను విడుదల చేస్తానని కాదంబరి జెత్వాని బెదిరించారని, తన నుంచి పదేపదే డబ్బు డిమాండ్ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఆరోపించారు. విజయవాడ: నటి కాదంబరి జెత్వానిపై ఉన్న బెదిరింపుల కేసులో, తనను రూ. 1.32 కోట్లు చెల్లించాలని బెదిరించారన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదును బలపర

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Egg prices skyrocket... hitting record levels.

    Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

  • High tension at Mudragada's residence; wife and supporters prevent daughter from entering.

    Mudragada Kranthi: ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్.. కూతురిని రానివ్వని భార్య, అభిమానులు

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd