HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2026 Retention Mini Auction Will All The Big Players Be Out

IPL 2026 రిటెన్షన్, మినీ వేలం… బడాబడా ప్లేయర్లంతా బయటకే?

  • By Vamsi Chowdary Korata Published Date - 10:28 AM, Sat - 15 November 25
  • daily-hunt
Ipl 2026 Auction
Ipl 2026 Auction

ఐపీఎల్ 2026 మినీ వేలంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15న రిటెన్షన్ జాబితాలు సమర్పించాల్సి ఉండగా, ఆ తర్వాత కూడా ట్రేడ్ విండోలు తెరిచే ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. ఈ రిటెన్షన్ ప్రాసెస్ను లైవ్లో ఎలా చూడాలి, ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడు జరుగుతుందనే వివరాల కోసం వార్తలోకి వెళ్లాల్సిందే.

ఐపీఎల్ 2025 మెగా వేలం కంటే ఐపీఎల్ 2026 మినీ వేలమే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్ ఎలా జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? లేక ఆఖర్లో ట్విస్ట్ ఇస్తూ ఆగిపోతుందా? అన్న టెన్షన్లో ఐపీఎల్ ఫ్యాన్స్ ఉండిపోయారు. ఐపీఎల్ 2026 రిటెన్షన్ తేదీ, మినీ వేలం ఎప్పుడు జరుగుతుంది? రిటెన్షన్ లిస్ట్ తర్వాత కూడా ట్రేడ్ విండోలు మార్పులు చేయొచ్చా? లేదా? అన్న డౌట్స్కు ఫుల్ క్లారిటీ ఇదిగో!

ఐపీఎల్ 2026 రిటెన్షన్కు సంబంధించిన కీలక రోజు వచ్చేసింది. నవంబర్ 15 శనివారం నాటికి అన్ని పది ఐపీఎల్ జట్లు తమ రిటైన్ చేసిన, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలను అధికారికంగా సమర్పించాల్సి ఉంది. ఈసారి పలు స్టార్ క్రికెటర్ల భవితవ్యం నిర్ణయించనుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రిటెన్షన్ డెడ్లైన్కు కొద్దిసేపటి ముందు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల నుంచి శార్ధూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూధర్ఫోర్డ్ను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి ట్రేడ్ చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో సంజూ శాంసన్, రవీంద్ర జడేజాలు భారీ ట్రేడ్లో భాగమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఐదుసార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ను రాజస్థాన్ రాయల్స్ నుంచి తీసుకునే అవకాశాలు బలంగా ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జడేజా సేవలను అందుకునే అవకాశం ఉందని జట్టు వర్గాలు సూచిస్తున్నాయి. గత మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆఱ్) అత్యధికంగా రూ.23.75 కోట్లు వెచ్చించి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్ను ఈసారి విడుదల చేసే అవకాశం ఉందనే సమాచారం కూడా బయటకు వచ్చింది.

రిటెన్షన్ ప్రక్రియతో జట్లు తమ స్క్వాడ్ను సుస్థిరం చేసుకునే మొదటి దశను ప్రారంభిస్తాయి. అంటే జట్టులో ఎవరిని ఉంచుకోవాలి, ఎవర్ని రిలీజ్ చేయాలనే క్లారిటీ ఇస్తాయి. నవంబర్ 15న ఈ ప్రక్రియ పూర్తవగానే.. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న మినీ వేలంతో జట్లు తమ ఏర్పాట్లను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మెగా వేలం లేకపోవడం వల్ల జట్లు ఎంతమంది ఆటగాళ్లనైనా రిటైన్ చేసుకోవచ్చు. అయితే మొత్తంగా జట్టు బలం 25 మందికి మించరాదు.. జట్టు పర్స్ కూడా రూ.120 కోట్లలోపే ఉండాలి.

రిటెన్షన్ జాబితా ప్రకటించిన తర్వాత కూడా జట్లు ట్రేడ్ విండోలో మార్పులు చేయవచ్చు. అంటే ఒకవేళ ఏవైనా రెండు ఫ్రాంఛైజీలు తమ ప్లేయర్లను స్వాప్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత జూన్ 4న తెరచిన ట్రేడ్ విండో డిసెంబర్ 9 వరకు అంటే వేలానికి వారం ముందు వరకు కొనసాగుతుంది.

ఐపీఎల్ 2026 రిటెన్షన్స్ నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమం ప్రసారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్ –ద క్షిణాఫ్రికా తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. రిటెన్షన్స్ను టీవీలో లైవ్గా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. ఇక మొబైల్ లేదా వెబ్లో వీక్షించాలనుకునేవారు జియో హాట్స్టార్ యాప్ లేదా వెబ్సైట్లో ఐపీఎల్ 2026 రిటెన్షన్స్ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • CSK
  • IPL 2026
  • IPL 2026 Retention
  • IPL 2026 Retention List
  • KKR
  • MI
  • rcb
  • SRH
  • TATA IPL

Related News

Virat Kohli

Virat Kohli: వైజాగ్‌లో విరాట్ కోహ్లీ క్రేజ్‌..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!

భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్‌లో జరగనుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.

  • IPL Auction

    IPL Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. విదేశీ ఆటగాళ్లకు కొత్త నియమం!

  • RCB

    RCB: ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌బోయేది ఇత‌నేనా?!

  • Smriti Mandhana

    Smriti Mandhana: డిసెంబ‌ర్ 7న‌ స్మృతి, పలాష్‌ల పెళ్లి.. అస‌లు నిజం ఇదే!

  • Robin Smith

    Robin Smith: ఇంగ్లాండ్ క్రికెట్‌కు బ్యాడ్ న్యూస్‌.. మాజీ క్రికెట‌ర్ క‌న్నుమూత‌!

Latest News

  • HILT Policy : హిల్ట్ పాలసీపై విమర్శలు.. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

  • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

  • India-Russia : భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

  • Akhanda 2 Postponed : అఖండ-2 వాయిదా..నిర్మాతల పై బాలయ్య తీవ్ర ఆగ్రహం?

  • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

Trending News

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

    • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

    • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd