IPL 2022: ఐపీఎల్ లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న జట్టు అదే
ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసి ఆ ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ మ్యాచ్ లు వస్తే చాలు క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.
- By Naresh Kumar Published Date - 05:54 PM, Thu - 17 March 22

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెర తీసి ఆ ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ మ్యాచ్ లు వస్తే చాలు క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అంత ప్రజాదారణ ఉన్న ఐపీఎల్ సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్ లో ఉండే ప్రతి జట్టుకి భారీ స్థాయిలో సోషల్ మీడియాలో పాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న జట్లలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ .ఐపీఎల్ లో ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ధోనీసేన మీద ఆడియన్స్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై సోషల్ మీడియాలో విశేషమయిన పాలోయింగ్ ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మొత్తంగా 30.8 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఫేస్ బుక్ లో 13 మిలియన్ లు ఉండగా, ఇంస్టాగ్రామ్ లో 9.6 మిలియన్లు ,ట్విట్టర్ లో 8.2 మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారు. వీటి ద్వారా సీఎస్కే అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత సోషల్ మీడియా లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. రోహిత్ సేనకు సోషల్ మీడియాలో టోటల్ గా 29.3 మిలియన్లు ఉండగా మూడవ స్థానంలో కలకత్తా నైట్ రైడర్స్ 23.6 మిలియన్ల ఫాలోవర్స్ తో ఉంది.ఇక ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 23.4 మిలియన్ ఫాలోవర్స్ తో 4వ స్థానంలో ఉంది .మొత్తానికి గేమ్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ధోని టీమ్ క చెన్నై సూపర్ కింగ్స్ టాప్ స్థానంలో ఉంది. ఐపీఎల్ టోర్నీ ఈ నెల 26 నుండి మొదలు కాబోతుంది.డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో కలకత్తాతో పోటీ పడనుంది.