IND-W Beat ENG-W: స్మృతి మంధానా సెంచరీ.. ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం!
టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ నాటింగ్‌హామ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా మొదటి నుండి విజృంభించి షెఫాలీ వర్మాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
- By Gopichand Published Date - 11:14 PM, Sat - 28 June 25

IND-W Beat ENG-W: భారతదేశం మొదటి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను (IND-W Beat ENG-W) 97 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ 210 పరుగులు చేసింది. బదులుగా ఇంగ్లండ్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున కెప్టెన్ స్మృతి మంధానా 112 పరుగులతో విజృంభించి ఆడింది. బౌలింగ్‌లో శ్రీ చరణి, రాధా యాదవ్, దీప్తి శర్మ విజయవంతంగా రాణించారు.
టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ నాటింగ్‌హామ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధానా మొదటి నుండి విజృంభించి షెఫాలీ వర్మాతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. స్మృతి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుండగా షెఫాలీ వర్మా 20 పరుగుల వద్ద ఔట్ అయింది. స్మృతి 62 బంతుల్లో 112 పరుగులు చేసింది. ఇందులో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. హర్లీన్ దేఓల్ కూడా 23 బంతుల్లో 43 పరుగులతో భారత్ స్కోర్‌ను 210కి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.
Also Read: BJP State presidential Race : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి..ఆ ఇద్దరిలో ఎవరికో..?
ఇంగ్లండ్‌కు 211 పరుగుల లక్ష్యం
211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభం చాలా దారుణంగా ఉంది. 9 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్లు ఔట్ అయ్యారు. కెప్టెన్ నాట్ సైవర్-బ్రంట్ ఒక ఎండ్‌ను నిలబెట్టుకున్నప్పటికీ మరో ఎండ్ నుండి వరుసగా వికెట్లు పడ్డాయి. ఇంగ్లండ్ జట్టులో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేరుకున్నారు. కెప్టెన్ బ్రంట్ 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తమ జట్టును 97 పరుగుల భారీ ఓటమి నుండి కాపాడలేకపోయింది.
Maiden T20I Hundred for Smriti Mandhana! 💯 👌
What a knock from the captain & what a way to bring it up in style 👏
Updates ▶️ https://t.co/iZwkYt7Crg#TeamIndia | #ENGvIND | @mandhana_smriti pic.twitter.com/Gv2Yar5R4z
— BCCI Women (@BCCIWomen) June 28, 2025
భారత జట్టు తరపున శ్రీ చరణి అత్యధిక వికెట్లు తీసింది. ఆమె 3.5 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ ఒక్కొక్కరు రెండు వికెట్లు తీశారు. అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి ఒక్కొక్క వికెట్ తీసారు.