HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shoaib Malik 3rd Marriage Divorce

Shoaib Malik 3rd Marriage Divorce : షోయబ్ మాలిక్ కు సానియా మీర్జా శాపం తగిలిందా..? అందుకే ఇలా అయ్యిందా..?

Shoaib Malik 3rd Marriage Divorce : షోయబ్ మాలిక్, సనా జావేద్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం వారి మధ్య ఉన్న దూరానికి స్పష్టమైన సంకేతంగా పాక్ మీడియా పేర్కొంటోంది

  • By Sudheer Published Date - 12:45 PM, Sat - 4 October 25
  • daily-hunt
Shoaib Malik 3rd Marriage D
Shoaib Malik 3rd Marriage D

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్తాన్ క్రికెటర్‌ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. 2024లో సానియా(Sania Mirza)తో 15 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలికిన షోయబ్, వెంటనే పాకిస్తాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సానియా మీర్జా కంటే ముందే షోయబ్ మరో యువతిని పెళ్లి చేసుకుని ఎక్కువకాలం జీవించలేకపోయాడు. ఆ తర్వాతే సానియాతో వివాహం జరిగింది. ఈ మూడు వైవాహిక బంధాల్లోనూ స్థిరత్వం లేకపోవడం, ముఖ్యంగా సానియాతో విడాకుల తర్వాత సనా జావేద్‌తో చేసిన మూడో వివాహం కూడా గందరగోళంలో పడిందని పాక్ మీడియాలో వార్తలు రావడం షాక్‌కు గురిచేస్తోంది.

‎Blood Sugar: భోజనం చేసిన వెంటనే ఈ విధంగా చేస్తే చాలు షుగర్ కంట్రోల్ అవ్వడం కాయం!

సానియాతో విడాకుల తర్వాత షోయబ్ మాలిక్, సనా జావేద్‌ (Shoaib Malik, Sana Javed ) మధ్య ప్రేమ మొదలై వివాహం వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి సంబంధం కూడా చల్లారిపోతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సనా జావేద్ కూడా షోయబ్ మాలిక్ మొదటి భార్య కాదనే విషయం ఆసక్తికరం. ఆమె పాకిస్తాన్ సింగర్‌ ఉమర్ జస్వాల్‌తో వివాహం చేసి తర్వాత విడిపోయి షోయబ్‌ను రెండోసారి వివాహం చేసుకుంది. ఇలా ఇరువురి గత సంబంధాలు విఫలమయ్యిన నేపథ్యంలో మూడో వివాహం కూడా ఎక్కువకాలం నిలవకపోవచ్చనే వార్తలు పాక్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షోయబ్–సనా జంట మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు, దూరం, చల్లబడిన బంధం అన్నీ ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇటీవల షోయబ్ మాలిక్, సనా జావేద్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం వారి మధ్య ఉన్న దూరానికి స్పష్టమైన సంకేతంగా పాక్ మీడియా పేర్కొంటోంది. అంతేకాకుండా ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరింత బహిరంగమయ్యాయి. షోయబ్ అభిమానులతో ఆటోగ్రాఫ్‌లు ఇస్తుంటే సనా ముఖంలో కోపం, అసహనం స్పష్టంగా కనిపించడం, ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చున్నప్పటికీ మాట్లాడుకోకుండా ఉండటం వంటి వీడియోలు వైరల్‌ కావడంతో విడాకుల ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ పరిణామాలు చూస్తుంటే షోయబ్ మాలిక్ మూడో వివాహం కూడా సంక్షోభంలోకి వెళ్లిందనే అనుమానాలు బలపడుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Sana Javed
  • Sania Mirza's ex Shoaib Malik
  • shoaib malik
  • Shoaib Malik 3rd Marriage Divorce

Related News

Shoaib Malik

Shoaib Malik: మూడో భార్య‌కు కూడా విడాకులు?!

సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ మూడవ వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఆయన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా జన్మించాడు.

    Latest News

    • CM Chandrababu: ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు

    • India vs West Indies: వెస్టిండీస్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం!

    • Shoaib Malik 3rd Marriage Divorce : షోయబ్ మాలిక్ కు సానియా మీర్జా శాపం తగిలిందా..? అందుకే ఇలా అయ్యిందా..?

    • Job Calendar : 20 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

    • Good News from the Center : వాహనదారులకు కేంద్రం శుభవార్త

    Trending News

      • Gold Jewellery: ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవ‌చ్చు?

      • New Cheque System: చెక్ క్లియరెన్స్‌లో కీల‌క మార్పులు.. ఇకపై కొన్ని గంటల్లోనే డ‌బ్బులు!

      • KL Rahul Hundred: కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. భార్య సెలబ్రేషన్ వైర‌ల్‌!

      • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

      • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd