న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రితీ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు పేస్ బాధ్యతలు అప్పగించవచ్చు.
- Author : Gopichand
Date : 27-12-2025 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
India vs New Zealand: భారత్- న్యూజిలాండ్ మధ్య జనవరి 11 నుండి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి టీమ్ ఇండియా ఎంపికపై కీలక అప్‌డేట్స్ వచ్చాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కెఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ 2-1తో విజయం సాధించినప్పటికీ న్యూజిలాండ్ సిరీస్‌కు కెప్టెన్ మారే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునే ఐదు ప్రధాన అంశాలు ఇవే అని ఓ నివేదిక పేర్కొంది.
మళ్ళీ కెప్టెన్సీ మార్పు
దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ ఇప్పుడు పూర్తిగా ఫిట్ అయ్యాడు. గిల్ జట్టులోకి తిరిగి వస్తుండటంతో, అతనే జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. దీనివల్ల కెఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాల్సి ఉంటుంది.
శ్రేయస్ అయ్యర్ పునరాగమనం
గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్.సి.ఏలో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకుంటున్నాడు. అతను వేగంగా కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
సీనియర్ల ఎంపిక ఖాయం
ఈ వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్ల ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని బలమైన జట్టును బరిలోకి దింపాలని బోర్డు భావిస్తోంది.
బుమ్రాకు విశ్రాంతి.. యువ పేసర్లకు ఛాన్స్
పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రితీ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు పేస్ బాధ్యతలు అప్పగించవచ్చు.
కెఎల్ రాహుల్ పాత్ర
దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలిపించినప్పటికీ గిల్ రాకతో రాహుల్ కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. కెప్టెన్సీ పరంగా అతనికి బోర్డు మొగ్గు చూపడం లేదని సమాచారం.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు (అంచనా)
- శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.