India vs England: చివరి వరకు పోరాడి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ!
అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
- By Gopichand Published Date - 10:52 PM, Sat - 25 January 25

India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇంగ్లండ్‌పై తిలక్ వర్మ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా 2 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించాడు. ఒకానొక సమయంలో ఇంగ్లండ్ మ్యాచ్‌పై పట్టు సాధించింది.
కానీ తిలక్ ఒంటిచేత్తో పోరాడి భారత్‌కు విజయాన్ని అందించాడు. అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లు మ్యాచ్ ఆద్యంతం తమ పట్టును నిలబెట్టుకున్నారు. కానీ ఒక్క తిలక్ వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
చెన్నై వేదికగా ఈరోజు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. తిలక్ వర్మ అజేయంగా తన ఇన్నింగ్స్‌లో 55 బంతుల్లో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్ ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరఫున బట్లర్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. భారత్ తరఫున అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు.
Also Read: Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ, ఎప్పుడు చూడాలి?
రెండో టీ20 మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ భారత్‌కు విజయాన్ని అందించాడు. అతను తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను చిత్తు చేశాడు. తిలక్ ఒంటిచేత్తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ తప్ప మరే భారత బ్యాట్స్‌మెన్ కూడా 30 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. గత మ్యాచ్‌లో హీరోగా నిలిచిన అభిషేక్ 12, సంజు 5 పరుగుల వద్ద ఔటయ్యారు. కాగా ఈ మ్యాచ్‌లో 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ 55 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.