Nani @Cricket Match: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో సందడి చేసిన నాని.. వీడియో..!
స్టార్ హీరో నాని (Nani) పాన్ ఇండియా వైడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి దిగాడు.
- By Gopichand Updated On - 10:22 PM, Sun - 19 March 23

స్టార్ హీరో నాని (Nani) పాన్ ఇండియా వైడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి దిగాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 30న థియేటర్ లో సందడి చేయనుంది.
అయితే.. వైజాగ్ వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నాని లైవ్ లో సందడి చేశాడు. తనకి క్రికెట్ తో ఉన్న అనుబంధాన్ని కామెంటేటర్స్ తో షేర్ చేసుకున్నాడు. గ్రౌండ్ లో చాలా సేపు సందడి చేసిన నాని.. కామెంటేటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అంటే సుందరానికీ టీంతో తాను చివరగా కలసి క్రికెట్ ఆడడానని చెప్పాడు. సచిన్ టెండూల్కర్ తన ఆల్ టైం ఫేవరిట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. టీమిండియాలో కీలక ప్లేయర్లని తన సినిమాలతో పోల్చాడు. హార్దిక్ పాండ్యాని పిల్లజమీందార్ అని అన్నాడు. రోహిత్ శర్మ జెంటిల్ మాన్ అని.. విరాట్ కోహ్లీ గ్యాంగ్ లీడర్ అంటూ వారికి సూట్ అయ్యే విధంగా చెప్పాడు.
#DhoomDhaam ft. Natural Star @NameisNani & Former Australian Captain @AaronFinch5 at the #IndVsAus match in Visakhapatnam 🔥🥳💃🏾 #Dasara #DasaraOnMarch30th @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @SLVCinemasOffl @saregamasouth pic.twitter.com/L4yroQTZrT
— dinesh akula (@dineshakula) March 19, 2023
Also Read: India vs Australia: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. టీమిండియాలో రెండు మార్పులు..!
విశాఖ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభం అయింది. దీంట్లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలుపుతో ఊపుమీద ఉన్న టీమిండియా రెండో వన్డేలో కూడా విక్టరీ కొట్టేందుకు రెడీగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఈ వార్త రాసే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్ కోహ్లీ (22 నాటౌట్), హార్దిక్ పాండ్యా (1 నాటౌట్) పరుగులతో ఉన్నారు.

Related News

Ind Vs Aus: కుల్దీప్ పై మండిపడిన కోహ్లీ, రోహిత్.. అసలేం జరిగిందంటే?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడంతో తొలి