Suryakumar Yadav: ఇదంతా దేవుడి ప్లాన్.. రింకూ సింగ్‌పై సూర్యకుమార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
హరారేలో జరిగిన మ్యాచ్‌లో రింకు 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 218.88 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. అతని తుఫాను చూసి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు.
- By Gopichand Published Date - 11:52 PM, Sun - 7 July 24

Suryakumar Yadav: టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో అవకాశం లభించలేదు. అయితే ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రింకూ బ్యాటింగ్ చేసిన తీరు అభిమానులకు జోష్ ఇచ్చింది. హరారేలో జరిగిన మ్యాచ్‌లో రింకు 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 218.88 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. ఈ సమయంలో రింకూ 104 మీటర్ల సిక్సర్ కొట్టి ఔరా అనిపించాడు. అతని తుఫాను చూసి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు.
రింకూ సింగ్ బ్యాటింగ్ పై సూర్య స్పందించాడు. సూర్య తన ఎక్స్ ఖాతాల్లో రింకూను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇదంతా దేవుని ప్లాన్ రింకూ సింగ్ అని రాసుకొచ్చాడు. అయితే ఈ డైలాగ్‌ని సూర్యకుమార్ యాదవ్ గతంలో కూడా చాలా సార్లు ఉపయోగించాడు. అయితే ఇప్పుడు రింకూపై సూర్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read: Abhishek: టీమిండియా ఘన విజయం.. పలు రికార్డులు బద్దలుకొట్టిన అభిషేక్ శర్మ..!
It’s all gods plan #RinkuSingh
— Surya Kumar Yadav (@surya_14kumar) July 7, 2024
సూర్యకుమార్ యాదవ్ ట్వీట్ పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే రింకూకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో తానేంటో నిరూపించుకునేందుకు జింబాబ్వే టూర్ ఉపయోగపడుతుందని నెటిజన్లు ట్వీట్ చేశారు. రింకూ సింగ్ స్థానంలో శివమ్ దూబే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న విషయం మనకు తెలిసిందే. రింకూ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అయిత రింకూ రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేయటం చాలా కష్టమైన నిర్ణయమని రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌కు ముందు విలేకరుల సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp : Click to Join
అయితే అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. సౌతాఫ్రికా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు సౌతాఫ్రికాపై 7 పరగులు తేడాతో ఘన విజయం సాధించి 2024 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. దీంతో టీమిండియా ఐసీసీ ట్రోఫీ కరువు తీరినట్లైంది. అయితే ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.