Kohli- Rohit: రోహిత్, విరాట్ కోహ్లీ ఫామ్.. టీమిండియాపై ఎఫెక్ట్!
ముఖ్యంగా విరాట్ కోహ్లి గురించి మాట్లాడితే 2024 అతనికి ఏమాత్రం కలిసిరాలేదు. కోహ్లి ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. అందులో అతని సగటు 22.2 మాత్రమే. ఈ ఏడాది 245 పరుగులు మాత్రమే చేశాడు.
- By Gopichand Published Date - 11:53 PM, Sat - 26 October 24

Kohli- Rohit: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో భారత్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. శనివారం పూణె టెస్టులో సందర్శకులు భారత్‌ను ఓడించి సిరీస్‌లో 2-0తో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఓటమితో సిరీస్‌ను కోల్పోయింది. ఇక భారత్ వైఫల్యం కోణాలను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల (Kohli- Rohit) వైఫల్యం జట్టుపై భారం పడింది. భారత్ తన గడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్‌లను గెలిచింది. అయితే న్యూజిలాండ్ చేతిలో రెండో టెస్టు ఓడిపోవడంతో ఈ చారిత్రాత్మక రికార్డుకు కూడా బ్రేక్ పడింది.
ముఖ్యంగా విరాట్ కోహ్లి గురించి మాట్లాడితే 2024 అతనికి ఏమాత్రం కలిసిరాలేదు. కోహ్లి ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. అందులో అతని సగటు 22.2 మాత్రమే. ఈ ఏడాది 245 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో అతని ఇన్నింగ్స్ 70 పరుగులతో కొన్ని ఆశలను పెంచింది. అయితే సిరీస్‌లోని రెండవ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టీమిండియా మిడిలార్డర్‌లో విరాట్ ఫామ్‌లో లేకపోవడంతో భారీ నష్టం జరిగిందని క్రీడ పండితులు అంటున్నారు.
Also Read: Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎంపికకు ప్రత్యేకమైన యాప్: మంత్రి పొంగులేటి
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ అయినా, రెడ్ బాల్ అయినా దూకుడుగా ఆడుతున్నాడు. ఈ సంవత్సరం రోహిత్ 19 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ 559 పరుగులు చేశాడు. అందులో అతని పేరు మీద రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. కానీ బంగ్లాదేశ్‌పై అతను నాలుగు ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే న్యూజిలాండ్‌పై రోహిత్ ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లలో 62 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని ఫామ్ కూడా భారత్ జట్టులో ఆందోళనను పెంచుతోంది.
పూణె టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ కేవలం 156 పరుగులకే పరిమితమైంది. ఇందులో విరాట్, రోహిత్ మినహా సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈసారి విఫలమయ్యారు. అతను సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 150 పరుగుల ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. కానీ పూణె టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను మొత్తం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రెండో టెస్టులో పునరాగమనం చేసిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ 30 పరుగులు, 23 పరుగుల స్కోర్‌లను పెద్ద ఇన్నింగ్స్‌గా మార్చలేకపోయారు. గిల్ తన షాట్లను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసిన జైస్వాల్.. తర్వాతి మ్యాచ్‌ల్లో వేగంగా ఆడడమే కాకుండా అవసరమైన సమయంలో జట్టు భారాన్ని తన భుజాలపై మోయాల్సి ఉంటుంది.