Harshit Rana: రోహిత్ సలహా ఫలించింది.. రాణా కామెంట్స్ వైరల్!
ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌తో హర్షిత్ రాణా తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ శివం దూబే గాయపడ్డాడు.
- Author : Naresh Kumar
Date : 07-02-2025 - 3:25 IST
Published By : Hashtagu Telugu Desk
Harshit Rana: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో యశస్వి జైస్వాల్, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) భారత్ తరఫున అరంగేట్రం చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు హర్షిత్ రాణాపై ఎటాకింగ్ బ్యాటింగ్ చేసింది. కానీ రాణా పుంజుకుని ఇంగ్లిష్ బ్యాటర్లని ఒక్కొక్కరిని పెవిలియన్ కి దారి చూపాడు. 10వ ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. మంచి ఫామ్ లో ఉన్న బెన్ డకెట్ మరియు హ్యారీ బ్రూక్ వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించాడు. అయితే తన సక్సెస్ వెనుక రోహిత్ శర్మ ఉన్నట్లు రాణా పేర్కొన్నాడు. రాణా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌తో హర్షిత్ రాణా తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ శివం దూబే గాయపడ్డాడు. దీంతో రాణా కంకషన్ ప్రత్యామ్నాయంగా బౌలింగ్ వేశాడు. తన తొలి టీ20లోనే రాణా ఆకట్టుకున్నాడు. అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి 8.20 ఎకానమీతో 33 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 7 ఓవర్లు బౌలింగ్ చేసి 7.60 ఎకానమీతో 53 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో రాణా వన్డే అరంగేట్రం అద్భుతంగా మొదలైంది. అయితే ఆరంభంలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. రాణా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫిల్ సాల్ట్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. అప్పుడు రాణా రోహిత్ సలహా తీసుకున్నట్లు చెప్పాడు. రోహిత్ శర్మ సలహాతో బౌలింగ్ చేసి తిరిగి లయను అందుకున్నానని అన్నాడు. మొదట్లో పరుగులు ఇచ్చాను కానీ నా లయను కోల్పోలేదు. అప్పుడు రోహిత్ శర్మ నన్ను స్టంప్స్ వద్ద బౌలింగ్ చేయమని చెప్పాడు. ఆలా బలమైన పునరాగమనం చేశానని పేర్కొన్నాడు.
Also Read: Tata Punch EV Discount: సూపర్ న్యూస్.. ఈ కారుపై రూ. 70,000 వరకు తగ్గింపు!
ఇదిలాఉంటే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగ్గా ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్ తో పాటుగా యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేశారు. రాణా అద్భుతంగా బౌలింగ్ చేయగా, యశస్వి అద్భుత ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు.