IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ ఓడిన టీమిండియా, తుది జట్లు ఇవే!
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
- By Gopichand Published Date - 02:24 PM, Thu - 20 February 25

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN) జట్లు నేటి నుండి తమ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. ఇందులో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా తన రికార్డును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
వన్డే క్రికెట్‌లో భారత్‌దే పైచేయి
వన్డే క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్‌ల రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీం ఇండియా 32 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. బంగ్లాదేశ్ స్వదేశంలో భారత్‌తో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది.
Also Read: APSRTC Jobs: ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. 800 మందికి ఉద్యోగ అవకాశాలు
పిచ్ రిపోర్ట్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించవచ్చు. మీడియా కథనాల ప్రకారం.. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం తాజా పిచ్‌ను ఉపయోగించనున్నారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకారం అందిస్తోందనే వాదన వినిపిస్తోంది. భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని తన ప్లేయింగ్ ఎలెవన్‌ని టీమిండిమా ఎంపిక చేసుకుంటుంది. దుబాయ్ పిచ్‌పై డ్యూ కీలక పాత్ర పోషించనుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ కూడా కీలకం కానుంది.
భారత్ జట్టు
- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
బంగ్లాదేశ్ జట్టు
- తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్