HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Icc Asks Pcb To Cancel Champions Trophy Tour In Pok

Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఐసీసీ కీల‌క నిర్ణయం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది.

  • Author : Gopi Date : 15-11-2024 - 6:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Champions Trophy Final
Champions Trophy Final

Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి (Champions Trophy Tour) సంబంధించి భారత్-పాక్ మధ్య వాతావరణం వేడెక్కింది. పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీని వెనుక కారణాన్ని పీసీబీ.. ఐసీసీని అడిగి ఆరా తీస్తోంది. భద్రతా కారణాలను బీసీసీఐ ఇప్పటికే పేర్కొంది. ఈ సిరీస్‌లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ టూర్‌ను నిర్వహించ‌నుంది. ఈ పర్యటనలో ఛాంపియన్స్ ట్రోఫీ పోకెలోని మూడు నగరాలకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ఈ విషయంలో పీసీబీకి ఐసీసీ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. షెడ్యూల్ ప్రకారం.. ట్రోఫీని స్కర్డు, ముర్రే, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉంది. అయితే వీటిలో స్కర్డు, హుంజా, ముజఫరాబాద్‌లు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రోఫీని పీఓకేకి పంపేందుకు ఐసీసీ అంగీకరించడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఏ వివాదాస్పద ప్రదేశానికి వెళ్లబోదని ఐసీసీ పీసీబీకి తెలిపింది. నవంబర్ 14న ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్లామాబాద్ చేరుకోవడం గమనార్హం.

Also Read: Toll Tax Update: టోల్ ట్యాక్స్ విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

దీని తరువాత ట్రోఫీని నవంబర్ 16 నుండి నవంబర్ 24 వరకు పాకిస్తాన్ అంతటా తీసుకెళ్లాల్సి ఉంది. ఈ విషయాన్ని పీసీబీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీని స్కర్డు, ముర్రీ, హుంజా, ముజఫరాబాద్ వంటి ప్రదేశాలకు వెళ్తుందని పీసీబీ తెల‌ప‌డంతో ఐసీసీ వ్య‌తిరేకించిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

ఐసీసీ సమావేశాన్ని రద్దు చేసింది

ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అదే సమయంలో నవంబర్ 11న జరగాల్సిన ఐసీసీ సమావేశాన్ని వాయిదా వేసింది. ఇందులో షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Champions Trophy
  • Champions Trophy 2025
  • ICC
  • ICC Champions Trophy 2024
  • ind vs pak
  • PCB

Related News

    Latest News

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd